29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM Jagan: వైఎస్ఆర్ జిల్లాలో కడప స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ చేసిన సీఎం జగన్..!!

Share

AP CM Jagan: వైయస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటనలో జెఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కీ సంబంధించి భూమి పూజ మరియు శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ కడప జిల్లా ప్రజల చిరకాల స్వపనం నెరవేర్చడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని.. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో కలలు కన్నారని అన్నారు. కానీ ఆయన  మరణించాక ఈ ప్రాంతాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదని తెలియజేశారు.

CM Jagan performed Bhumi Pooja for Kadapa Steel Plant in YSR district

అయితే ఇంత కాలానికి ఆయన బిడ్డ… మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక మళ్ళీ ఈ ప్రాంతానికి మంచి రోజులు రావడం జరిగాయని స్పష్టం చేశారు. భగవంతుని దయతో వైఎస్ఆర్ జిల్లాకీ మంచి రోజులు వచ్చాయని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎక్కువ మందిని పిలవలేకపోయినట్లు చెప్పుకొచ్చారు. “₹8,800 కోట్లతో మూడు మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి అవుతుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతోంది. ఈ ప్లాంట్ రావడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ స్టీల్ ప్లాంట్ వలన ఈ ప్రాంతం స్టీల్ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతుంది. గండికోట రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పైప్లైన్ ద్వారా నీటి సరఫరా అవుతుంది.

CM Jagan performed Bhumi Pooja for Kadapa Steel Plant in YSR district

ఈ క్రమంలో తొలివిడతలో ₹3,300 కోట్లతో వేట పది లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి జరుగుతుంది అని సీఎం జగన్ పేర్కొన్నారు. “₹700 కోట్ల మౌలిక వసతులు అభివృద్ధి చేయడం జరుగుతుంది. 30 నెలల లోపు స్టీల్ ప్లాంట్ తొలి దశ పనులు పూర్తవుతాయి. మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యం తో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో చుట్టుప్రక్కల అనేక రంగాల అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. ఇంకా ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలకు ఉపాధి దొరుకుతాయని అన్నారు. 75% ఉద్యోగాలు ఈ ప్రాంతానికి చెందిన వాళ్లకి ఇవ్వాలన్నే చట్టం కూడా తీసుకొచ్చినట్లు సీఎం జగన్ గుర్తు చేశారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీ అని స్పష్టం చేశారు.


Share

Related posts

Fennel: కేవలం పదే పది రోజుల్లో మచ్చలు లేని మెరిసే చర్మం మీ సొంతం..!!

bharani jella

సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి గుండె పోటుతో మృతి

Special Bureau

Prabhas: గడచిన రెండు సంవత్సరాలలో ప్రభాస్ రిజెక్ట్ చేసిన డైరెక్టర్ల లిస్టు..??

sekhar