Dharmavaram (satyasai): శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మే 7న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ధర్మవరం పట్టణ యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరానికి సంబంధించి కరపత్రాలను నిర్వహకులు విడుదల చేశారు. 7వ తేదీన నిర్వహించి ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పౌండేషన్ అధ్యక్షుడు వైకే శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు ఈ శిబిరానికి వచ్చి కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యువర్స్ ఫౌండేషన్ సెక్రటరీ సుకుమార్, కోశాధికారి సీ రాధాకృష్ణ, క్యాంపు చైర్మన్ శీలా నాగేంద్ర, డాక్టర్ బివి సుబ్బారావు, పోలా ప్రభాకర్, బీఆర్ రంగనాథం, ఎస్ చాంద్ బాషా, పి లక్ష్మీనారాయణ, ఆర్ బాలాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.