ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన రద్దు .. ఏపి పర్యటన యథాతధం

Share

ఎన్డీఏ రాాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము తన షెడ్యుల్ ప్రకారం ఈ రోజు ఏపి, తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తొంది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్రౌపది ముర్ము మంగళవారం ఏపి పర్యటన అనంతరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో ముర్ము ప్రచారం ఇంకా పూర్తి కాని నేపథ్యంలో సమయాభావం వల్ల ఆమె తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల 16వ తేదీ ఢిల్లీలో ద్రౌపది ముర్ము పాల్గొననున్న బీజేపీ ఎంపీల సమావేశానికి తెలంగాణకు చెందిన అయిదుగురు ఎంపీలకు ఇప్పటికే అహ్వానం అందింది. తెలంగాణ నుండి కేవలం అయిదుగురు పార్లమెంట్ సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్యేలు మత్రమే ఉండటం కూడా ఈ పర్యటన రద్దుకు ఒక కారణంగా తెలుస్తొంది. మరో పక్క టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాల మూలంగా ఎవరైనా ఎన్డీఏ అభ్యర్ధికి క్రాస్ ఓటింగ్ చేస్తే అది బోనస్ అవుతుందని అంటున్నారు. ఇక ఏపి పర్యటన విషయానికి వస్తే..

రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో 1.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. బీజేపీ దాని మిత్ర పక్షాల నేతలు రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. ఆమె తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రానున్నారు. విమానాశ్రయ ప్రాంగణంలో సంప్రదాయ గిరిజన నృత్యాలతో ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర బీజేపీ ఏర్పాట్లు చేసింది. ఆ తరువాత మంగళగిరి సమీపంలోని సికే కన్వెన్షన్ హాలులో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్ జగన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ద్రౌపది ముర్ము సీకే కన్వెన్షన్ హాలు వద్ద సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలకనున్నారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించే ఈ సమావేశంలో ద్రౌపది ముర్ము కు స్వాగతం పలుకుతూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ప్రసంగిస్తారు. తొలి సారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు రాష్ట్రపతి అభ్యర్ధిగా అవకాశం కల్పించడాన్ని వైసీపీ స్వాగతించింది. ఈ సమావేశంలో వైఎస్ జగన్, ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.

 

బీజేపీ నేత సత్యకుమార్ గాలి తీసేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. మ్యాటర్ ఏమిటంటే..?


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

35 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

2 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

4 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago