NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

I-PAC: చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ …కీలక ప్రకటన విడుదల చేసిన ఐపాక్

I-PAC: టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రత్యేక విమానంలో నారా లోకేష్ తో కలిసి గన్నవరం వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన సమావేశమైయ్యారు. దాదాపు మూడు గంటల పాటు భేటీ జరిగింది. ఇదే ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో ఐపాక్ బాస్ గా రాష్ట్రంలో వైసీపీ గెలుపునకు పని చేశారు.

ఇప్పుడు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఐపాక్ కీలక ప్రకటన విడుదల చేసింది. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గెలుపు కోసం తాము పని చేస్తున్నట్లు పేర్కొంది ఐపాక్. ఐపాక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ కు మా వంతు తోడ్పాటు అందిస్తాం.. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సీపీ తో కలిసి పని చేస్తున్నాం..2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గెలుపు కోసమే మేము పని చేస్తాం’ అని స్పష్టం చేసింది.

చాలా కాలం క్రితమే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ నుండి తప్పుకున్నారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ .. చంద్రబాబుతో భేటీ అయిన నేపథ్యంలో సామాన్యుల్లో కలిగే సందేహాలను నివృత్తి చేసేందుకే ఐపాక్ ఈ విధంగా ప్రకటన చేసి ఉండవచ్చని సమాచారం. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ ఆయన వ్యక్తిగతం, ఐపాక్ కు సంబంధం లేదు అన్నట్లుగా తెలిపే ఉద్దేశం వెల్లడైంది.

కాగా, చంద్రబాబుతో భేటీ అనంతరం తిరుగు ప్రయాణంలో గన్నవరం విమానాశ్రయం వద్ద ప్రశాంత్ కిషోర్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. చంద్రబాబు సీనియర్ నేత..అందుకే మర్యాదపూర్వకంగా ఆయననను కలిసేందుకు వచ్చా. దీనిపై ఎలాంటి ఊహగానాలు వద్దు అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పి పీకే అక్కడ నుండి వెళ్లిపోయారు.

AP Politics: ఏపీ ఎన్నికల్లో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు..ఏ పార్టీకి ప్లస్ .. ఏ పార్టీకి మైనస్..?

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju