విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపిస్తూ మాట్లాడారు. దీంతో వైసీపీ నేతల నుండి రజనీకాంత్ కు విమర్శల దాడి మొదలైంది. మంత్రి ఆర్కే రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, మీడియా ఆకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తదితరులు రజనీకాంత్ పై విమర్శలు మొదలు పెట్టారు. రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారడంతో వైసీపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ లు ఇస్తున్నారు.

రజనీకాంత్ సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నారని అన్నారు కొడాలి నాని. పవన్ కళ్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజనీకాంత్ ను చంద్రబాబు రంగంలోకి రంగంలోకి దించారని, ఇప్పటికైనా చంద్రబాబు రాజకీయాలను పవన్ గ్రహించాలని హితవు పలికారు. ఎన్టీఆర్ పై చెప్పులు విసురుతుండగా వైశ్రాయ్ హోటల్ లో చంద్రబాబుకు రజినీ మద్దతు తెలిపారనీ, ఇప్పుడు ఎన్టీఆర్ ను పొగడటం సిగ్గుచేటని అన్నారు. వెధవులంతా ఒక చోట చేరి చేస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ప్రజలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అన్నారు కొడాలి నాని. మూడు రోజులు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు హాస్పటల్ లో ఉండే రజిని తెలుగు ప్రజలకేమి చెబుతాడని అన్నారు. ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతూ రజినీకాంత్ మరింత దిగజారుతున్నాడని ఘాటుగా విమర్శలు గుప్పించారు.
కొమ్మినేని శ్రీనివాసరావు స్పందిస్తూ .. రజినీకాంత్ తాను వచ్చిన పనికే పరిమితమై మాట్లాడి ఉంటే బాగుండేదని ఇతర అంశాలపై మాట్లాడి ఆయన అజ్ఞానాన్ని ప్రదర్శించారని అన్నారు. ఐటీ రంగం తొలుత అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ ఆధ్వర్యంలో బెంగళూరులో విస్తరించిందనీ, అనంతరం చెన్నై లో ఆ రంగం ఊపందుకుందని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే రజనీకాంత్ అజ్ఞానంతో మాట్లాడి ప్రజాగ్రహానికి గురయ్యారన్నారు. ఒక వేళ చంద్రబాబు తో ఏదైనా ప్రత్యేక అవగాహనతో ఉన్నారేమో అని పిస్తుందని ఆయన ఎద్దేవా చేసారు.
రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందని కామెంట్స్ చేసిన మంత్రి ఆర్కే రోజా