NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Kuppam TDP: కుప్పంలో టీడీపీ సీన్ రివర్స్ ..!? చంద్రబాబు తప్పులతో షాకింగ్ న్యూస్..!

Kuppam TDP: రాజకీయం అంటే తను గెలవడం..ప్రత్యర్ధులను ఓడించడం. రాజకీయం అంటే ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండటం..తాను గెలవడానికి ఎన్ని చేయాలో అన్నీ చేయడం, ఎదుటి వాడిని ఓడించడానికి ఎన్ని చేయాలో అన్నీ చేయడం. రాజకీయాల గురించి, రాజకీయాల్లో అసలైన రంగు గురించి ఈ రాజకీయ వ్యవస్థ గురించి తెలుగు రాష్ట్రాల్లో బహుశా చంద్రబాబు కంటే ఎక్కువ తెలిసిన వారు ఎవరూ ఉండరేమో.45 ఏళ్లుగా రాజకీయంలో తల పండిపోయి చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్నారు. అటువంటి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తెలుగు దేశం పార్టీ ఇప్పుడు భయం భయంతో పోరాడుతోంది.. ఆ పోరాటంలో కూడా విజయం వరిస్తుందో లేదో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలుగు దేశం పార్టీలో జరుగుతున్న ఓ అంతర్గత చర్చ, వైసీపీలో బాహాటంగా కనిపిస్తున్న ఒక ఆత్మస్థైర్యపు చర్చ వీటిని కాస్త లోతుగా పరిశీలించి విశ్లేషిస్తే కుప్పం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆసక్తికర పరిస్థితులు మనం గమనించవచ్చు. బహుశా ఇటువంటి పరిస్థితులు చంద్రబాబు తన జీవిత కాలంలో ఊహించి ఉండరు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా…

 

Kuppam TDP chandrababu
Kuppam TDP chandrababu

Kuppam TDP: ఒక్క దశతోనే ఆగిపోయారు..కానీ ఇప్పుడు…?

కుప్పం మున్సిపాలిటీ గెలుచుకోవడం వైసీపీకి అతి పెద్ద లక్ష్యం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. ఇక రాష్ట్రంలో ప్రజలు అందరూ వైసీపీతోనే ఉన్నారు. జగన్ తోనే నడుస్తున్నారు అని రాష్ట్రం అంతా చాటి చెప్పడానికి, పనిలో పని గా తెలుగుదేశం పార్టీ లోని నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి మళ్లీ ఇప్పుడిప్పుడే పుంజుకోకుండా చేయడానికి, ఈ కుప్పం మున్సిపాలిటీలో విజయం వైసీపీకి బాగా పనికి వస్తుంది. అందుకే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలోని వైసీపీ బృందం గెలుపు వ్యూహాలను పక్కాగా అమలు చేస్తోంది. దీన్ని నుంచి తప్పించుకోవడం కుప్పం తెలుగు తమ్ముళ్లకు సాధ్యం కావడం లేదు. ఈ విషయం పక్కన పెట్టి కుప్పం మున్సిపాలిటీని ఎలాగైనా గెలుచుకోవడం టీడీపీకి అవసరం. ఆ పార్టీలో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండాలన్నా, రాష్ట్రం మొత్తం ప్రజల్లో ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ ఉనికి పట్ల ఒక దృఢమైన నమ్మకం పెరగాలన్నా, పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి కాస్త బయటపడాలన్నా కుప్పం మున్సిపాలిటీలో మంచి ఆధిక్యతతో తెలుగుదేశం గెలవడం చాలా ముఖ్యం. కానీ అక్కడ పరిస్థితులను చూస్తే.. చంద్రబాబు చేసిన కొన్ని తప్పులు రాజకీయంలో సహజంగా ఎదురయ్యే దశల వల్ల టీడీపీ దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. అవి ఏమిటంటే..

*1989 నుండి చంద్రబాబు కుప్పంలో ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. మెజారిటీ కూడా సరాసరి 40 – 45 వేలు పైబడే ఉంటోంది. ఆయన గెలుపు కోసం అక్కడి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దగా సీరియస్ గా పని చేయాల్సిన పని లేదు. ఎన్నికలకు పది పదిహేను రోజుల ముందు ఇంటింటికి వెళ్లి పార్టీ తరపున ప్రచారం చేసి అమ్మా ఓటు వేయండి, మన చంద్రబాబు పోటీ చేస్తున్నారు. ఓటు వేయండి అంటూ చాలా సింపుల్ గా ప్రచారం చేసుకుంటే చాలు. పోల్ మేనేజ్ మెంట్ చేయాల్సిన పని లేదు. ప్రత్యర్ధితో భీభత్సంగా తలపడాల్సిన పని లేదు. ప్రత్యర్ధి ఏదో చేస్తారనే అవసరం రాలేదు. కానీ * ఇటువంటి పరిణామాలతో కుప్పంలో తెలుగుదేశం నాయకులు ముదరలేదు. రాజకీయంగా పూర్తి స్థాయిలో పరిణితి చెందలేదు. కేవలం సాధారణ ఎన్నిక నిర్వహణ, సాధారణ ఎన్నికల ప్రక్రియకు మాత్రమే అలవాటు పడ్డారు. ఇంటింటి ప్రచారం, ఓపెన్ టాప్ వెహికల్ పై ప్రచారం, నాలుగు మాట్లాడటం, ప్రత్యర్ధి పార్టీలను తిట్టడం వరకే నేర్చుకున్నారు. ఈ నాలుగు దశాబ్దాలుగా అక్కడ ఇలా నడిచిపోయింది. *కానీ ఇప్పుడు సీఎం జగన్ సీరియస్ ఆదేశాలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఈ ఇద్దరి నేతృత్వంలో వైసీపీ నాయకులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు గతంలో లేని విదంగా పక్కా స్ట్రాటజీలను అమలు చేస్తున్నారు. 2017లో నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పన్నిన వ్యూహాలకు ధీటుగా గతంలో చంద్రబాబు అమలు చేసిన పోల్ మేనేజ్ మెంట్ లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఒక రకంగా చెప్పాలంటే వాటికి ఎన్నో రెట్లు మించి కుప్పంలో ప్రస్తుతం పెద్దిరెడ్డి టీమ్ అమలు చేస్తోంది.

కానీ ఇప్పుడు వైసీపీ అమలు చేస్తున్న స్ట్రాటజీలను ఎదురొడ్డి నిలబడటం కుప్పంలో తెలుగుదేశం పార్టీ వల్ల కావడం లేదు. *ఓటమి భయం మనిషిలో లోతున దాగి ఉన్న కామన్ సెన్స్ ను బయటకు తీసుకువస్తుంది. చావు భయం కసి పెంచినట్లు, ఓటమి భయం కూడా మనిషికి గెలుపు పాఠాలను నేర్పుతుంది. కానీ ఇన్నాళ్లూ కుప్పంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ సేఫ్ పొలిటికల్ జోన్ లో ఉన్నారు. అక్కడి నుండి బయటకు వచ్చి డేంజర్ జోన్ లోకి ఎంటర్ అయి దాన్ని ఛేదించడం వాళ్లు నేర్చుకోలేదు. కానీ ఇప్పుడు దాన్ని ఛేదించాల్సిన అవసరం ఏర్పడింది. పోల్ మేనేజ్ మెంట్ క్రిటికల్ సెచ్యుయేషన్ లో ఉన్నప్పుడు ఛేదించాల్సిన ఆవస్యకత ఏర్పడింది. ప్రత్యర్ది పార్టీలు వేసే అనూహ్యమైన ఎత్తుగడలను తట్టుకుని నిలబడాల్సిన అవసరం వచ్చింది. కానీ అవి ఏమీ కుప్పంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు చేతకావు. దీన్ని ఆయుధంగా వాడుకున్న అధికార పార్టీ కుప్పంలో నాయకులను కుప్పంలో పరిమితం చేసి వాళ్లకు పాఠాలు నేర్పడానికి, పోల్ మేనేజ్ మెంట్ చేయడానికి వెళ్లిన నిమ్మల రామానాయుడు, పులివర్తి నాని, అమరనాధ్ రెడ్డి లాంటి నాయకులను బయటకు పంపించేశారు. సో.. ఇప్పుడు కుప్పంలో నాయకులకు పెద్ద దిక్కు లేకుండా పోయారు. పోల్ మేనేజ్ మెంట్ పాఠాలు లేవు, ప్రత్యర్ధి పార్టీ చర్యలను అడ్డుకునే ప్రణాళికలు లేవు. అవి ఏమీ లేక కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు డేంజర్ గేమ్ లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. సో.. ఈ పరిణామాలు అన్ని గమనిస్తే చంద్రబాబు చేసిన తప్పు చాలా సింపుల్ గా కుప్పంలో నాయకులకు ఓటమి భయం లేకుండా చేయడం తన సొంత నియోజకవర్గంలో నాయకులకు ఇతర నియోజకవర్గాలు 2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నిక గానీ, ఆ తరువాత మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికలకు గానీ లేదా అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికలకు ఓటమి భయంతో టీడీపీి పోరాడిన ఉప ఎన్నికలకు కుప్పంలో నాయకులను పంపించి ఉంటే వాళ్లకు కొన్ని పాఠాలు తెలిసేవి. కానీ తన సొంత నియోజకవర్గ నాయకులను అటువంటి పోరాటాలకు చంద్రబాబు వాడలేదు. సో.. వాళ్లకు ఇప్పుడు గత అనుభవం లేక పొలిటికల్ పాఠాలు మైండ్ లో లేక ఏమి చేయాలో తెలియక తేలియాడే పరిస్థితి వచ్చింది. అందుకే కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఆశలు అటు ఇటుగా ఊగిసలాడుతున్నాయి. వైసీపీ సంబరాలు చేసుకోవడానికి సిద్ధం అవుతోంది. అర్ధం అయ్యే ఉంటుందిగా ..? కుప్పంలో ఏమి జరగబోతుందో..?

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N