NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Municipal Elections : ఫలితాలపై ఉత్కంఠ .. కాకిలెక్కలతో కాలక్షేపం

Municipal Elections : పురపాలక ఎన్నికల ఫలితాలపై ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూమ్‌లో భద్రంగా ఉండిపోగా పోలింగ్ సరళిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఆదివారం ఉదయం 8గంటల నుండి 11 కార్పోరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో ఎన్నికల కౌంటింగ్ జరగనున్నది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చిలకలూరిపేట మున్సిపాలిటీ, ఏలూరు కార్పోరేషన్ లో ఓట్ల లెక్కింపు చేయడం లేదు. ఫలితాల వెల్లడికి మరో 48 గంటలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండగా అభ్యర్థులు, వారి అనుయాయులు మాత్రం పోలింగ్ కేంద్రాల వారీగా నమోదైన ఓట్లు, ఓటింగ్ శాతం ఆధారంగా ఎవరికి ఎన్ని పడి ఉంటాయనే అంచనా వేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. పెరిగిన, తగ్గిన ఓటింగ్ శాతం పెరగడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఓటింగ్ శాతం తగ్గడం వల్ల ఎవరికి నష్టం అంటూ లెక్కలు కడుతున్నారు.

Municipal Elections :  Candidate counts on Pura election results
Municipal Elections : Candidate counts on Pura election results

మెజారీ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందన్న అంచనా ఉన్నప్పటికీ జనసేన, బీజేపీ అభ్యర్థులు రంగంలో ఉన్న స్థానాలలో చీలిక ఓట్ల ప్రభావం ఎవరిపై పడుతుంది అన్న దానిపైనా లెక్కలు కడుతున్నారు. మరో పక్క కొన్ని స్థానాల్లో జనసేన కీలకం అవుతుందని కూడా ఆ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పలు జిల్లాలలో జనసేన మద్దతుదారులకు  భారీగానే ఓట్లు వచ్చాయి. ఇవి సింబల్ ఎన్నికలు కావడంతో జనసేన, బీజేపీ పరిస్థితి ఏమిటి అన్నది కూడా ఈ ఫలితాలను వారు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర స్థాయిలో బీజేపీ – జనసేన, టీడీపీ మద్య  ఎటువంటి అవగాహన ఒప్పందాలు లేకపోయినా పట్టణాల స్థాయిలో జనసేన, టీడీపీ నేతల మధ్య  లోపాయికారీ ఒప్పందలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఏలూరులో అయితే టీడీపీ అభ్యర్థులు లేని వార్డుల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బహిరంగంగా జనసేన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం కూడా చేశారు.

Municipal Elections :  Candidate counts on Pura election results
Municipal Elections : Candidate counts on Pura election results

ఇదిలా ఉంటే పట్టణాల వారిగా ఫలితాలపై చర్చించుకుంటున్నారు. ప్రధానంగా  విశాఖ, గుంటూరు, విజయవాడ నగర పాలక సంస్థలతో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మున్సిపాలిటీ లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే దానిపై కాకి లెక్కలు వేస్తున్నారు.  పంచాయతీ ఎన్నికల్లో పూర్తిగా చేతులు ఎత్తేసిన తెలుగుదేశం పార్టీ ఈ పురపాలక ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీకి ధీటుగానే ప్రచారం, పోల్ మేనేజ్‌మెంట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ కారణంగా అభ్యర్థుల గెలుపు ఓటములలో మెజారీలు స్వల్పంగానే ఉంటాయన్న మాట వినిపిస్తోంది. ఎవరి లెక్కలు, అంచనాలు ఎలా ఉన్నా ఫలితాల వెల్లడికి ఆదివారం వరకూ ఎదురుచూడాల్సిందే.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N