Akkineni Nagarjuna : వయసు పెరుగుతున్న కొద్దీ అక్కినేని నాగార్జున గ్లామర్ కూడా పెరుగుతోంది. ఏ ముహూర్తాన మన్మధుడు సినిమా నటించాడో తెలియదుగానీ, నాగార్జున మన్మధుడు గానే ఉన్నాడు. తాజాగా నాగార్జున మన్మధుడు 2 లో తన వయసు ఎంతో భిన్నమైన పాత్రలో నటించి అందరిని మెప్పించాలని ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం కాస్త రివర్స్ అయ్యింది. మన్మధుడు2 సినిమా తర్వాత ఫుల్ జోష్ లో వైల్డ్ డాగ్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు ఈ అక్కినేని హీరో. అయితే కరోనా కారణం వల్ల వాయిదా పడింది. ఇదే సమయంలో బిగ్ బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తరువాత అందరికన్నా ముందుగానే షూటింగ్ లో పాల్గొన్న నాగార్జున షూటింగ్ పూర్తి చేసినే ఈ సినిమా ఏప్రిల్ రెండో తేదీ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.
వైల్డ్ డాగ్ తర్వాత నాగార్జున వరుస సినిమాలను ట్రాక్ లో పెట్టారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగు జరుపుకోగా నాగార్జున మరొక సినిమాని కూడా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోందనీ సినీ వర్గాల సమాచారం. అదే “బంగార్రాజు” సినిమా. అక్కినేని నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోరూపొంది మంచి విజయాన్ని అందుకున్న సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా రాబోతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త ఆలస్యం అవుతుంది. స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేయడం వల్ల ప్రస్తుతం ఈ సినిమా చేయడానికి నాగార్జున ఓకే చెప్పినట్లు సమాచారం.
ఏకంగా నాగార్జునతోనే తలపడుతున్న హీరోయిన్:
సోగ్గాడే చిన్నినాయన సినిమా సీక్వెల్ గా తెరకెక్కబోతున్న బంగార్రాజు చిత్రంలో నాగార్జునతో పాటు తన వారసుడు నాగచైతన్య కూడా కనిపించనున్నట్లు సమాచారం వినబడుతుంది. అయితే ప్రస్తుతం నాగచైతన్య బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.కాగా బంగార్రాజు సినిమాకు సంబంధించిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా లేడీ హీరోయిన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు గతంలో “స్నేహమంటే ఇదేరా” సినిమాలో నాగార్జునతో జతకట్టిన భూమిక ప్రస్తుతం నాగార్జునతో పోటీ పడటానికి సిద్ధమైంది. రీ ఎంట్రీ తర్వాత నాని నటించిన ఎంసీఏ సినిమాలో మంచి గుర్తింపును సంపాదించుకున్న భూమిక బంగార్రాజు చిత్రంలో నెగటివ్ పాత్రలో ఏవిధంగా ఆకట్టుకుంటారో వేచిచూడాల్సిందే.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!