జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో తొలి రోజే అపశృతి చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా కత్తిపూడిలో సభ వేదిక వద్ద జరిగిన ప్రమాదంలో ఓ జనసైనికుడు ప్రమాదవశాత్తు ట్రాన్స్ ఫార్మర్ పై పడి మరణించాడు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు కత్తిపూడి బహిరంగ సభకు విచ్చేశారు. ఈ క్రమంలో ఓ యువకుడు పవన్ ను చూసేందుకు లైట్ స్టాండ్ ఎక్కాడు. దానిపై పట్టుతప్పడంతో ట్రాన్స్ ఫార్మర్ పై పడ్డాడు.

విద్యుత్ షాక్ తో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన యువకుడి సమాచారంపై ఆరా తీస్తున్నారు. వారాహి విజయ యాత్ర మొదటి రోజే ఇలా అపశృతి చోటుచేసుకోవడంతో జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన జనసేన నేతలు .. ఎవరూ విద్యుత్ స్తంబాలు ఎక్కవద్దని సూచించారు.
Achampeta (palnadu): ఉయ్యాలలో నిద్రిస్తున్న పసిపాప మంటల్లో సజీవ దహనం