Road Accident: వాహనదారుల నిర్లక్ష్యం, అతి వేగం, అజాగ్రత్త కారణంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు నిత్యం కృత్యం అవుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో కుప్పం – పలమనేరు జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుప్పం సమీపంలోని గుడుపల్లె మండలంలోని చిన్న శెట్టిపల్లిలో లారీ – కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది.

మృతులు కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వికాస్, కళ్యాణ్, మరో మెడికో కళ్యాణ్ రామ్ సోదరుడు ప్రవీణ్ గా గుర్తించారు. ప్రమాదానికి కారు మితిమీరిన వేగమే కారణంగా తెలుస్తొంది. పీఈఎస్ నుండి కారులో కుప్పం వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. వీరంతా కడప, నెల్లూరు కు చెందిన వారుగా గుర్తించారు. తమ స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే పార్టీ జరుపుకుని కారులో మితిమీరిన వేగంతో వెళ్తూ అదుపుతప్పి ముందు వైపు వెళ్తున్న లారీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా కారులో ఉన్న ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబీకులకు సమాచారం అందించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా కుప్పం – పలమనేరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తప్పించిన పోలీసులు వాహన రాకపోకలను పునరుద్దరించారు. ఈ ప్రమాద ఘటన మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. చేతికి అంది వచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదం కారణంగా అసువులు బాయడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యంగ్యాస్త్రాలు