YCP Plenary: వైసీపీ ప్లీనరీకి విజయమ్మ వస్తారా..? రారా..?.. సజ్జల ఇచ్చిన క్లారిటీ ఇది..!!

Share

YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారిగా జరుగుతున్న ఈ ప్లీనరీని బ్రహ్మాండంగా నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లీనరీ ప్రాంగణం ఏర్పాట్లను బుధవారం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డిలు పలువురు ముఖ్యనేతలతో కలిసి పరిశీలించారు. అయితే ప్లీనరీకి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయమ్మ హజరు అవుతారా ..? లేదా అన్న సందేహాలు కొద్ది రోజులుగా వినబడుతున్నాయి.

Sajjala Vijayasai Visit YCP Plenary campus

YCP Plenary: గౌరవాధ్యక్షురాలి హోదాలో ప్లీనరీకి విజయమ్మ

వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయ పార్టీ పెట్టిన నాటి నుండి విజయమ్మ ఆమె వెన్నంటే ఉంటున్నారు. అక్కడి వైఎస్ఆర్ టీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైఎస్ఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాల్లోనూ షర్మిలతోనే కలిసి పాల్గొన్నారు కానీ కుమారుడు జగన్ తో వేదికను పంచుకోలేదు అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కొద్ది రోజులుగా వైఎస్ విజయమ్మ పార్టీ ప్లీనరీకి వస్తారా..? రారా..? అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయమ్మ ప్లీనరీలో పాల్గొంటారని చెప్పారు. గత ప్లీనరీలో నవరత్నాలు ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చామనీ, ఈ సారి మరిన్ని మెరుగైన కార్యక్రమాలు చేపట్టి తిరిగి అధికారంలోకి వస్తామని సజ్జల పేర్కొన్నారు. ప్లీనరీకి వచ్చే నాయకులకు స్వయంగా సీఎం జగన్ అహ్వానిస్తారని చెప్పారు. ప్రతి వార్డు స్థాయి కార్యకర్తకు పార్టీ అధ్యక్షుడి సంతకంతో ఆహ్వానం ఉంటుందని తెలిపారు.

“కిక్ బాబు ఔట్” నినాదంతో

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచేందుకు ప్లీనరీలో అవసరమైన కార్యచరణపై దృష్టి సారిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో “కిక్ బాబు ఔట్” నినాదంతో ముందుకు వెళతామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ప్లీనరీ నిర్వహిస్తున్నామనీ, మళ్లీ అధికారంలోకి వచ్చాక మరల ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. తమ ప్లీనరీ సమావేశాలు మిగతా పార్టీ వారికి భిన్నంగా ఉంటాయన్నారు విజయసాయిరెడ్డి. జూలై 8వ తేదీన అధ్యక్షుడు ప్రారంభ ఉపన్యాసం చేస్తారనీ, 9వ తేదీ ముగింపు స్పీచ్ ఉంటుందని విజయసాయిరెడ్డి అన్నారు.


Share

Recent Posts

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు.. టార్కెట్ ఆఫ్ సర్కార్

దేశ రాజధాని ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసం సహా పలువురు ప్రముఖుల సంస్థలు, ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు జరుపుతోంది. మొత్తం…

15 seconds ago

Devatha: మాధవ్ కి మరోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా.!? రాధ ఓడిపోతుందా.!?

మాధవ్ రాధ దగ్గరకు వచ్చి వాటర్ కావాలని అడుగుతాడు.. ఇదిగో సారు నేను మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా దేవమ్మ నీ వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తను…

4 నిమిషాలు ago

ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో ప్రయాణం… సంతోషంలో జగతి, మహేంద్ర..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 533 వ ఎపిసోడ్ లోకి. ఎంటర్ అయింది. ఇక ఈరోజు ప్రసారం కానున్న ఆగస్టు 19 వ…

7 నిమిషాలు ago

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

1 గంట ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

1 గంట ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago