NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Rajinikanth: విజయవాడలో రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు

Share

Rajinikanth:  విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్  కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ఎన్టీఆర్ అసెంబ్లీ, చారిత్రిక ప్రసంగాల పుస్తకాలను రజనీకాంత్, బాలకృష్ణ  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సభను చూస్తుంటే రాజకీయం మాట్లాడాలని అనిపిస్తొందనీ, కానీ రాజకీయం మాట్లాడవద్దని అనుభవం చెబుతోందని వ్యాఖ్యానిస్తూనే చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని ఆయన ఘనత దే విదేశీ నాయకులకు కూడా తెలుసని తెలిపారు. హైదరాబాద్ ను హైటెక్ నగరంగా చంద్రబాబు మార్చారని కొనియాడారు. చాలా కాలం తర్వాత ఇటీవల హైదరాబాద్ ను తాను సందర్శించాననీ, ఆ సమయంలో తనకు హైదరాబాద్ లో ఉన్నానా.. లేక న్యూయార్క్ లో ఉన్నానా అనిపించిందన్నారు.

Rajini Kanth

ఎన్టీఆర్ స్పూర్తితో..

ఎన్టీఆర్ స్పూర్తితో తాను సినిమాల్లోకి వచ్చానని పేర్కొన్న రజనీకాంత్ .. హీరోగా తొలి సినిమా భైరవి అని గుర్తు చేశారు. పాతాళ భైరవి సినిమా గుర్తుకొచ్చి హీరో పాత్రకు ఒప్పుకున్నానని తెలిపారు. ఎన్టీఆర్ దుర్యోధనుడి పాత్ర చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఎన్టీఆర ప్రభావం తనపై ఎంతో ఉందనీ, గత పట్టుకుని ఎన్టీఆర్ నున ఆనుకరించే వాడినని తెలిపారు. ఎన్టీఆర్ క్రమశిక్షణ పాటించే వారని కొనియాడారు. దాన వీర సూరకర్ణలో ఎన్టీఆర్ లా ఉండాలనుకున్నానని, ఆయనలా మేకప్ వేసుకుని ఫోట దిగి తన స్నేహితులకు చూపించానని గుర్తు చేశారు. తాను కోతిలా ఉన్నానని తన స్నేహితుడు అన్నారని ఈ సందర్భంగా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Rajini Kanth

 

చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు..ఒక శక్తి అని అన్నారు. తనకు ఎన్టీఆర్ స్ఫూర్తి అని రజనీ కాంత్ చెప్పారన్నారు. ఎన్టీఆర్ మెచ్చిన నగరం విజయవాడ అని,  ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున సభ జరపడం ఆనందంగా ఉందన్నారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ క్రేజ్ అసామాన్యమని,  రజనీ కాంత్ కి విదేశాల్లో కూడా అభిమానులున్నారన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రావాలని తాను రజనీకాంత్ ను ఆహ్వానిస్తే, ఆయన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చారన్నారు. స్వేహానికి.. అప్యాయతకు మారు పేరు రజనీకాంత్ అని, స్నేహం కోసం రజనీకాంత్ ఇక్కడికి వచ్చారని తెలిపారు. రజనీ కాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా నేను ఎన్టీఆర్ లాంటి వేషాలు వేయలేను అన్నారు అంటే చిన్న విషయం కాదన్నారు. ఈ తరం వారు, భవిష్యత్ తరం వారు కూడా ఎన్టీఆర్ లాంటి పాత్రలు చేయలేరని అన్నారు. తెలుగు వారిని అవమానించే సమయంలో, ఆత్మగౌరవం నినాదంతో పార్టీ పెట్టారని గుర్తు చేశారు. సినిమాల్లో ఎన్టీఆర్ క్రమశిక్షణలో ఎప్పుడూ ముందు ఉంటారనీ, టైం అంటే టైం కు అంతా రావాల్సిందన్నారు.

ఎన్ని విమర్శలు వచ్చినా, అనుకున్న పని చేసే నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ కు భారత రత్న వచ్చే వరకు తెలుగు జాతి పోరాడాలన్నారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇచ్చే వరకు మనం తీర్మానం చేస్తూనే ఉందామన్నారు. మళ్లీ దీనిపై తీర్మానం చేసి డిల్లీకి పంపుదామని చెప్పారు. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో ఇది మూడో మీటింగ్ అని  ఇప్పుడే మీటింగ్ ఇంత అదిరిపోయింది అంటే, ఇక రాజమండ్రిలో జరిగే మీటింగ్ ఎలా ఉంటుందో చూడండన్నారు. ఎన్టీఆర్ అంటే స్ట్యాట్యూ ఆఫ్ ప్రైడ్ కింద గుర్తించాలన్నారు. బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో కూడా రాణిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. మరో వైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న బాలకృష్ణను అభినందించాలన్నారు. స్ట్యాట్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ పేరుతో విగ్రహం, మెమోరియల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామనీ, మహానాడు రోజున యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తామని అన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరును పర్యాటక కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు ప్రకటించారు.

YS Viveka Case: తెలంగాణ హైకోర్టులో అవినాష్ కు లభించని ఊరట .. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా


Share

Related posts

Munugode Bypoll: రౌండ్ వైస్ కౌంటింగ్ ఫలితాల జాప్యంపై సీఈఓ వికాస్ రాజ్ ఇచ్చిన క్లారిటీ ఇది

somaraju sharma

మరో అదిరిపోయే లుక్‌లో కేక పుట్టించనున్న బాలయ్య..!

Ram

anandayya: ఆనంద‌య్య విష‌యంలో క‌మ్యూనిస్టుల ఎంట్రీ… జ‌గ‌న్ ఎలా డీల్ చేస్తున్నారంటే…

sridhar