29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నాలుగేళ్లలో మొదటి సారి టీడీపీలో ఉత్సాహం .. రెండు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ విజయంతో..

Share

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో పరాజయాలను చవి చూసిన టీడీపీ కి  ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మొదటి సారిగా ఉత్సాహాన్ని ఇచ్చాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీనే విజయం సాధిస్తూ వచ్చింది. ఈ నాలుగేళ్లలో ఏ ఎన్నికల్లోనూ వైసీపీని ధీటుగా ఎదుర్కోవడం గానీ, గట్టి పోటీ ఇవ్వడం గానీ టీడీపీ చేయలేకపోయింది. కానీ పట్టభద్రుల ఎన్నికల్లో రెండు స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించగా, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానంలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక్కడ నువ్వానేనా అన్న రీతిలో టీడీపీ – వైసీపీ మద్య హోరాహోరీ నెలకొంది.

Chiranjeevi, Srikanth

 

ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్ధి వేపాడ చిరంజీవి, తూర్పు రాయలసీమ పట్టభద్రల స్థానంలో టీడీపీ అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. ఉత్తరాంధ్ర స్థానంలో విజయానికి అవసరమైన ఓట్లలో 90 శాతం తొలి ప్రాధాన్యంలోనే సాధించిన చిరంజీవి రావు.. మిగిలిన ఓట్లను రెండో ప్రాధాన్యంలో దక్కించుకున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్ధి సీతంరాజు సుధాకర్ ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్ధి మాధవ్ సహా 34 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి.

ఇక తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్ గెలిచారు. రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి టీడీపీ అభ్యర్ధికి లక్షా 12,686 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్ధి శ్యాంప్రసాద్ రెడ్డికి 85,423 ఓట్లు వచ్చాయి. అర్ధరాత్రి వరకూ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపులో వైసీపీ, టీడీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది. 11 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాగా 95,969 ఓట్లతో మొదటి స్థానంలో వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రరెడ్డి, 94,169 ఓట్లతో భూమిరెడ్డి రామగోపాలరెడ్డి ఉన్నారు. నిబంధనల ప్రకారం విజేతకు అవసరమైన నిర్ణీత ఓట్లు రాని కారణంగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు రిటర్నింగ్ అధికారి ఆదేశించారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. స్థానిక సంస్థల కోటా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ వైసీపీ గెలుపొందినా, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు టీడీపీ గెలుచుకోవడం ఆ పార్టీలో జోష్ వచ్చినట్లు అయ్యింది.

Breaking: కడప ఎంపి అవినాష్ రెడ్డికి బిగ్ షాక్ .. అవినాష్ రెడ్డి మధ్యంతర పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు


Share

Related posts

‘న్యూస్‌’సెన్స్ ఛానళ్లపై ఓ విసురు!

Siva Prasad

Bypoll Results: ఆ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ‘నోటా’నే సెకండ్ ప్లేస్ .. ఎక్కడంటే..?

somaraju sharma

కుంభ్ వద్ద అగ్నిప్రమాదం

Siva Prasad