NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి అడ్డంకులు..??

YS Viveka Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రధాన నిందితులను అరెస్టు చేసిన సీబీఐ సూత్ర ధారుల అరెస్టునకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన వివేకా మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారడం, న్యాయమూర్తి సమక్షంలో అతని సాక్షాన్ని నమోదు చేయడంతో కేసు చివరి దశకు చేరుకుందని అందరూ భావించారు. ఈ తరణంలోనే నిందితుల తాలూకు వ్యక్తులు కడప కోర్టులో వివేకా కుటుంబంపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.

TDP Leader comments on YS Viveka Case
TDP Leader comments on YS Viveka Case

YS Viveka Case: ఒక క్లారిటీకి వచ్చిన సీబీఐ

ఈ కేసులో సీబీఐ దర్యాప్తుపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల క్రితం వరకూ సీబీఐ వద్ద పలువురు ఇచ్చిన వ్యాంగ్మూలాలు బయటకు వచ్చాయి. ఘటనా స్థలంలో సాక్షాధారాలు మాయం ఎవరు చేశారు. ? ఎవరు ఈ హత్య చేశారు..? ఎవరు చేయించారు..? అనే విషయాలపై సీబీఐ ఒక క్లారిటీకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. సంబంధిత నిందితులకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైతే వారు నోటీసులు తీసుకోలేదని కూడా వార్తలు వచ్చాయి.

YS Viveka Case: సీబీఐకి అడ్డంకులు తొలగిపోతే..

ఈ తరుణంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అంచెలంచెలుగా సాగుతోందని వర్ల రామయ్య అన్నారు. ఈ కేసు దర్యాప్తును కొన్ని పెద్ద శక్తులు అడ్డుపడుతున్నాయని అందరూ అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ అంతఃపుర రహస్యాన్ని ఛేదించడం సీబీఐకి పెద్ద పనేమీ కాదని అన్నారు. అయితే సీబీఐ కున్న అడ్డంకులు తొలగిపోతే వాస్తవాలన్నీ చకచకా బయటకు వస్తాయని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

Related posts

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju