NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

బాపట్ల జిల్లాలో దారుణం .. టెన్త్ విద్యార్ధి సజీవ దహనం

Advertisements
Share

బాపట్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టెన్త్ విద్యార్ధి అమర్నాథ్ పై స్నేహితులే పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. చెరుకుపల్లి మండలం రాజోలులో ఈ ఘటన జరిగింది. అమర్నాథ్ ఉదయం ట్యూషన్ కు వెళ్లి వస్తుండగా, ఆ బాలుడి స్నేహితుడు, మరి కొందరు కలిసి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. తీవ్రంగా గాయపడిన అమర్నాథ్ ను కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్ కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Advertisements

చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీ పరిధి ఉప్పలవారిపాలెంకు చెందిన ఉప్పల అమర్నాథ్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. రోజు ఉదయం రాజోలులో ట్యూ,న్ కి వెళుతున్నాడు. ఎప్పటి మాదిరిగానే శుక్రవారం ఉదయం ట్యూషన్ కు వెళుతుండగా మార్గమధ్యలో రెడ్లపాలెం వద్ద అమర్నాథ్ స్నేహితుడు ఒకరు మరి కొందరితో కలిసి అతనిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. మంటలు అంటుకుని బాలుడు హాహాకారాలు చేస్తుండటంతో స్థానికులు గమనించి మంటలను ఆర్పి అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు అతన్ని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు అమర్నాథ్ మృతి చెందాడు.

Advertisements

పోలీసులు అమర్నాథ్ వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. ఈ ఘటనపై చెరుకుపల్లి ఎస్ఐ కొండారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. రెండు నెలల క్రితం అమర్నాథ్ కు అతని సహచరులకు మధ్య జరిగిన ఘర్షణను పురస్కరించుని ఈ ఘాతకానికి వడిగట్టారని భావిస్తున్నారు. అమర్నాథ్ ను అప్పుడు మిత్రులు కొట్టడంతో తల్లిదండ్రులతో చెప్పాడని, దానిపై అమర్నాథ్ తల్లిదండ్రులు వారిని మందలించారని సమాచారం. తమ కుమారుడుని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అతని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Gutti (Anantapur): అనంతలో దారుణం .. రైలులో సీటు కోసం గొడవ


Share
Advertisements

Related posts

బ్రేకింగ్: లెజండరీ గాయకుడు ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్

Vihari

GHMC: కరోనా మృతుల అంత్యక్రియల రేట్లు ఫిక్స్ చేసిన జీహెచ్ఎంసీ! జంట నగరాల వాసులకు ఇది ఊరటే!!

Yandamuri

‘జుంబారే జుమ్ జుంబారే’ రీమేక్ సాంగ్ లో నిధీ అగర్వాల్ హైలెట్ ..!

GRK