హామీ ట్రాప్: విశాఖలో హానీ ట్రాప్ కేసులో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ పై ఆంతరంగిక భద్రత చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ త్రివిక్రమ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. పాకిస్తాన్ కు చెందిన హానీట్రాప్ కేసులో కపిల్ పై కేసు నమోదు చేసి, అతని వద్ద మూడు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని సైబర్ ఫొరెన్సిక్ కు పంపించడం జరిగిందని సీపీ చెప్పారు. కానిస్టుబల్ కపిల్ ను కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం ప్రశ్నిస్తున్నాయన్నారు.

గుజరాత్ కు చెందిన కపిల్ కుమార్ విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యురిటీ లో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడనీ, ఇంతకు ముందు హైదరాబాద్ లోని భారత్ డైనమిక్ లిమిటెడ్ లో విధులు నిర్వహించి గత ఏడాది ఆగస్టు లో విశాఖ కు బదిలీ పై వచ్చాడని సీపీ తెలిపారు. ప్రస్తుతం అతను సీఐఎస్ఎఫ్ ఫైర్ విభాగంలో పని చేస్తూనే ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన తమీషాతో మాట్లాడుతున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయన్నారు. తమీషా ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ముఖ్య నాయకుడి వద్ద వ్యక్తిగత సహాయకురాలిగా పని చేస్తున్నట్లు గుర్తించడంతో కపిల్ పై నిఘా పెట్టారన్నారు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోన్ లను స్వాధీనం చేసుకుని అందులో డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
TTD: రాజాసింగ్ ఆరోపణల్లో నిజం లేదు .. వాస్తవం ఇది