Krishnamma Kalipindi Iddarini: అమృత మన పెళ్లి జరగలేదని ఒక ఆడపిల్ల మీద నింద వేయడం కరెక్ట్ కాదు అని ఆదిత్య అంటాడు నువ్వు ఇంత అమాయకుడివి ఏంటి ఆదిత్య కావాలంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అడుగు అఖిలను అరెస్టు చేశారో లేదో వాళ్లే చెప్తారు ఎవరు అబద్ధం చెప్పిన మీ అమ్మ అబద్ధం చెప్పదుగా కాబట్టి వెళ్లి ఆవిడనే అడుగు అని అమృత అంటుంది.అమృత నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కానీ అన్నయ్యకు వదిన అంటే ప్రాణం ఈ విషయాలు తెలిస్తే అన్నయ్య ప్రాణాలతో ఉండలేడు ఇంక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిది ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో నీకు దండం పెడతాను నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడ ఎవరైనా చూస్తే బాగోదు అని అమృతను అక్కడి నుంచి పంపించేస్తాడు ఆదిత్య.

కట్ చేస్తే ఆదిత్య అమృత మాట్లాడుకుంటుండగా ఈశ్వర్ వింటాడు ఇదంతా నిజమా అని తన మనసులో తను మదన పడుతూ ఉంటాడు ఇంతలో గౌరీ లోపలికి వస్తుంది సిగ్గుతో అడుగు ముందుకు పడడం లేదండి మీరు వచ్చి నన్ను తీసుకెళ్లొచ్చుగా అని గౌరీ మనసులు అనుకుంటుంది అయినా ఆయన మౌనంగా ఉన్నారు అంటే నేను వచ్చిన సంగతి ఆయనకు తెలియదు కదా అని గౌరీ ముందుకు వెళుతుంది మీతో జీవితం పంచుకునే ముందు నా బాధను మీతో పంచుకుంటానండి లేకపోతే మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది అని గౌరీ తన మనసులో తను అనుకుంటుంది మీ ముందు నన్ను ఒక దోశిల నిలబెడుతుంది అబద్ధం కాబట్టి నేను నిజం చెప్పేస్తాను అని పాల గ్లాసు అక్కడ టేబుల్ మీద పెడుతుంది.

అందమైన భర్తలు అందరికీ దొరుకుతారండి ప్రేమించి అర్థం చేసుకునే భర్తలు కొంతమందికే దొరుకుతారు కానీ నాకు మాత్రం అందం తో పాటు అర్థం చేసుకునే భర్త దొరికాడు అని గౌరీ అంటుంది.కానీ దానికంటే ముందు నేను కొన్ని ప్రశ్నలు నిన్ను అడుగుతాను వాటికి సమాధానం చెప్పాలి అని ఈశ్వర్ అంటాడు.సరేనండి నా నుండి మీ దగ్గర ఏ విషయం నేను దాచను మీరు ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు ఆ విషయాన్ని నన్ను అడగొచ్చు అని గౌరీ అంటుంది.నువ్వు నన్ను నిజంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా అని ఈశ్వర్ అంటాడు. మీలాంటి భర్త నాకు దొరకడం అదృష్టం అని ఎప్పుడూ అంటూ ఉంటాను కదా మరి ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా అని కొత్తగా అడుగుతారేంటి అని గౌరీ అంటుంది.మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి మా అమ్మ మీ ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు ఇష్టం లేదని ఆ రోజు చెప్పావా లేదా అని ఈశ్వర్ అంటాడు.

అవును చెప్పాను అని గౌరీ అంటుంది.మీ అమ్మ మా అమ్మకి పెట్టిన కండిషన్ నీకు తెలుసా ఎస్ ఆర్ నో నీకు తెలుసా లేదా అని ఈశ్వర్ గౌరీని గట్టిగా అడుగుతాడు. చేసేదేమీ లేక గౌరీ అవును తెలుసండి అని అంటుంది.బ్యూటీ పార్లర్ లో అఖిలను అరెస్టు చేశారా లేదా అఖిలను ఆ కేసు నుండి విడిపించడానికి మా అమ్మ దగ్గర 25 లక్షలు తీసుకున్నావా అన్నింటికంటే ముఖ్యమైన విషయం నిజం మాత్రమే చెప్పు ఆదిత్య అమృతల ప్రేమ విషయం నీకు తెలుసా లేదా నీకు తెలుసా లేదా అని ఈశ్వర్ మళ్లీ గట్టిగా అరుస్తాడు.తెలుసండి అని గౌరీ ఒప్పుకుంటుంది ఏమండీ మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను కానీ వాటి వెనక ముడిపడి ఉన్న విషయాలు కూడా మీకు చెప్పాలి అని గౌరీ అంటుంది.

చాలు గౌరీ ఇంకేం చెప్పొద్దు ఇప్పటివరకు నువ్వు చెప్పింది చాలు నన్ను పిచ్చోడిని చేసింది చాలు ఇంకెన్ని అబద్ధాలు చెప్పి నన్ను పిచ్చోన్ని చేస్తావ్ అని ఈశ్వర్ అంటాడు.ఏమండీ నేను మిమ్మల్ని పిచ్చి వాడిని చేయడమేంటండి నేను అలా ఎందుకు చెప్పాను ఒక్కసారి నా మాట వినండి అని గౌరీ అంటుంది.ఏం చెప్తావ్ వింటే ఇంకా అబద్ధాలు చెప్తావు నమ్మితే ఇంకా మోసం చేస్తావ్ అంతే కదా అని ఈశ్వర్ అంటాడు.ఊహించలేదండి మీ నోటి నుండి ఈ మాటలు వస్తాయని నేను ఊహించలేదు నేను మీకు అబద్ధం చెప్పి మోసం చేయడం ఏంటండీ ఈ మాట వింటేనే నాకు భరించలేనంత బాధగా ఉంది అని గౌరీ అంటుంది.కాదా నువ్వు చేసినవన్నీ మోసాలు కాదా నాకు చెప్పినవన్నీ అబద్ధాలు కాదా ఆరోజు సత్యనారాయణ వ్రతంలో ఆదిత్య ఆనందంగా ఉన్నాడా బాధగా ఉన్నాడా అని నిన్ను అడిగాను నాకు చూపు లేదు కాబట్టి నువ్వు ఏది చెబితే అదే నమ్ముతాను అని నీకు చెప్పానా లేదా ఆదిత్య అమృతల మధ్య ఏమైనా ఉందా లేదా అని నిన్ను అడిగానా లేదా అప్పుడు నువ్వేం చెప్పావు ఆదిత్య అలా లేడు చాలా సంతోషంగా ఉన్నాడు అని చెప్పావా లేదా చూపులేని నన్ను మోసం చేసినట్టా కాదా అని ఈశ్వర్ నిలదీస్తాడు. ఏమండీ మీ కోపంలో అర్థం ఉంది కానీ నేను చెప్పేది కూడా ఒకసారి వినండి అని గౌరీ అంటుంది.

గౌరీ ఇది కోపం కాదు బాధ మనం నమ్మిన వాళ్లు మన మనసుకి గాయం చేస్తే దానివల్ల భరించలేనంత బాధ ఈ లోకంలో నేను నిన్ను నమ్మిన అంతగా ఎవరిని నమ్మలేదు పెళ్లికి ముందే చెప్పాను మన మధ్య ఎలాంటి దాపరికాలు రహస్యాలు ఉండకూడదు అని మంచైనా చెడైనా మనం చెప్పుకుందాం పంచుకుందామని అని ఈశ్వరి అంటాడు.ఏమండీ మీకు నేను ఎలాంటి అబద్ధం చెప్పలేదండి అని మళ్ళీ గౌరీ అంటుంది.వద్దు నేను నమ్మను నమ్మలేని పరిస్థితిని నువ్వు మీ కుటుంబం తీసుకువచ్చారు నీ మీద నాకున్న ప్రేమని నీ చెల్లెలి పెళ్లికి అనుగుణంగా మార్చుకున్నావు ఎస్ ఇది నిజం మా అమ్మ మీ ఇంటికి వచ్చి అడిగినప్పుడు పెళ్లికి ఒప్పుకోను అన్న నువ్వు తర్వాత ఎలా ఒప్పుకున్నావు నా కొడుకు పెళ్లి కాదేమో అన్న మా అమ్మ బాధని మీరు తెలుసుకొని మా అమ్మకు కండిషన్ పెట్టారు ఇంతకుముందు కొంతమంది అమ్మాయిలు నాకు చూపు లేదని అవకాశంగా తీసుకొని డబ్బులు కొట్టేద్దామని చూశారు ఇప్పుడు చూస్తుంటే నీకు వాళ్లకు పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తుంది కానీ ఒక రకంగా చూస్తే నీ కన్నా వాళ్లే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్లు మొహం మీదే చెప్పారు కానీ నువ్వు నమ్మక ద్రోహం చేశావు అని ఈశ్వర్ అంటాడు.అవన్నీ మాటలు వింటున్న గౌరీ ఎంతో బాధపడుతూ వెక్కి ఏడుస్తుంది.దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్ళి రేపు ఏం జరుగుతుందో చూద్దాం