Malli Nindu Jabili: ఆడపిల్లకి రక్షణ లేని సమాజం నుంచి నన్ను నమ్ముకుని వచ్చిన మల్లి అనే ఒక అమ్మాయికి ఏం జరగకూడదు అని భయం నాలో ఉంది, అందుకే ఆరాటపడుతున్నాను అందుకే దిగజారుతున్నాను అని అరవింద్ అంటాడు. అదే సమాజంలో బతక గలిగే ధైర్యం నాకు వచ్చింది ఇంక మీరు నా గురించి ఆలోచించకండి మానేయండి అని మల్లి అంటుంది. అవును ఇప్పుడు నువ్వు తెలివైన దానివి గొప్పదానివి ఇప్పుడు నీలో అన్ని ఉన్నాయి ఒక్క మనుషులు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోవడం తప్ప అని అరవింద్ అంటాడు.

ఆ విషయం నేను మీ ఇంట్లో ఉన్నప్పుడే తెలుసుకున్నాను అని మల్లి అంటుంది. ఫ్యూచర్లో ఆ ఇంట్లో తెలుసుకుంటావు నువ్వు… ఇప్పుడు నీకు ఆ ఇల్లు స్వర్గంలా కనిపిస్తుంది కానీ అది అందమైన నరకం. స్వర్గమో నరకమో ఉండడానికి అయితే ఒక నీడ ఉండాలి కదా అని మల్లి అంటుంది. అలా అని పులి బొన్లో ఉండకూడదు కదా అని అరవింద్ అంటాడు. నేను అలా అనుకోవడం లేదు అని మల్లి అంటుంది.అలా జరగకపోతే ఫస్ట్ సంతోషించేది నేనే అని అరవింద అంటాడు.

బాస్ నాకు జాబ్ ఇచ్చారు గుర్తింపు ఇచ్చారు సన్మానం చేశారు అవసరం తెలుసుకొని షెల్టర్ ఇచ్చారు గౌతమ్ సార్ గురించి నేను చెడుగా అనుకోలేను అని మల్లి అంటుంది. టేబుల్ తుడిపించాడు, మెడ పట్టుకుని బయటికి గెంటాడు, నీ చేయి టచ్ చేసినందుకు ఎంప్లాయ్ చెంప పగలగొట్టాడు, ఫోన్ పగలగొట్టాడు, రేపు ఇంకేం చేస్తాడు అని అరవింద్ అంటాడు. మీరు ఆయన మీద ఉన్న ఉక్రోషంతో మాట్లాడుతున్నారు.నేను నీ గురించి మాట్లాడుతున్నాను అయినా నమ్ముతావ్ అనుకున్నాను నీ ఇష్టం ఇక నేను నీ వెంట పడను, నీ సేఫ్టీ గురించి నేను పట్టించుకోను, నీ దారి నీది నా దారి నాది నీ గురించి మాలినిని పట్టించుకోకుండా ఉండాల్సిన అవసరం నాకు లేదు.

మంచి చేసే వాళ్లను గుర్తించడం జ్ఞానవంతుల లక్షణం. తెగిపోయేటప్పుడు దారం విలువ విడిపోయేటప్పుడు బంధాల విలువ తెలుస్తాయి అంటారు ఇంక నీ విషయాలు నాకు అనవసరం ఇక నేను నిన్ను పట్టించుకోను వదిలేస్తాను అని గౌతమ్ వెళ్లిపోతాడు. మాలిని వస్తుంది ఆఫీస్ దగ్గరికి. అరవింద్ వచ్చి మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు వెళ్లిపోదాం పద అంటాడు. మల్లి బాబు గారు బాబు గారు పరిగెత్తుకుంటూ వస్తుంది. వాళ్ళిద్దరు కారులో వెళ్లిపోతారు. మీరు ఎప్పటికైనా మాలిని అక్క దగ్గరికి వెళ్లి పోయేవారు అని మల్లి అనుకుంటుంది. బయట నుండి ఇంటికి వెళ్తున్నాను దారిలో మీ ఆఫీస్ కదా అని నిన్ను చూసి వెళ్దామని వచ్చాను నువ్వు కోపంగా బయటికి రావడం కనిపించింది ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్తావా అని మాలిని అడుగుతుంది. మల్లి తో చిన్న డిస్టబెన్స్ అని అరవింద్ అంటాడు. చిన్న డిస్టబెన్స్, రెండు కుటుంబాలు సఫర్ అవుతున్నాయి అని మాలిని అంటుంది.మాలిని ఇప్పటికి ఇరిటేషన్ లో ఉన్నాను నన్నేం అడగకు, కోపంలో ఏదైనా అనేస్తాను తర్వాత నువ్వే మళ్ళీ బాధపడతావ్.

ఏదైనా ఉన్నప్పుడే దానివి తెలుసుకోవాలి లేనప్పుడు ఎంత ఆలోచించినా వేస్ట్. ఎప్పటికైనా నాతో నడిచేది నువ్వే నీతో ఉండేది నేనే అని మాలిని అంటుంది. కట్ చేస్తే మల్లి బాధ పడుతుంది, నా జీవితం నా చేతుల్లో లేదు నా మాటలు మిమ్మల్ని బాధపెట్టి ఉంటాయి కానీ నేనేం చేయలేను క్షమించండి బాబు గారు అని మల్లి అనుకుంటుంది. కట్ చేస్తే మల్లి గుడి కి వెళుతుంది. అమ్మ నేను ఏదో కోరుకుంటాను కానీ నువ్వు ఏదో జరిపిస్తావు అందుకే ఆశపడ్డం మానేశాను నీకు ఏది అనిపిస్తే అది చెయ్ నీ మీద నాకు కోపం లేదు ఎందుకంటే కష్టాల్ని ఎదిరించి ధైర్యాన్ని బాధల్ని సహనాన్ని ఇచ్చావు అందుకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను అని మల్లి తన మనసులో అనుకుంటుంది దేవుడికి దండం పెట్టుకొని. ఇంతలో మీరా గుడికి వస్తుంది. మల్లి ని చూస్తుంది. నేను ఆ ఇంట్లో ఉన్న నా ఆలోచన అంతా నీ గురించే అంటుంది మీరా.

నువ్వేమో గౌతమ్ బాబు గారి ఇంట్లో ఉన్నావు, అరవింద్ బాబు గారి ఇంటికి ఎట్లా వెళ్తావు అని ఆలోచిస్తుంటే నాకు ఏటి పాలు పోవడం లేదు. గౌతం బాబు గారి ఇంటి నుంచి బయటికి రావాల్సి వస్తే ఏ సత్రంలో ఉంటాను కానీ అరవింద్ బాబు గారి ఇంటికి నేను ఎందుకు వెళ్తాను. ఇలానే ఉంటావా ఏంటి ఏ తోడు వద్దా నీకు.ఆడది ఒంటరిగా బతకలేదా నువ్వు అలాగే 18 సంవత్సరాలు బతికావు కదా. నా గత జీవితం చూసుకోకూడదు అనే కదా నా బాధ. ఒక తోడును వెతుక్కోవడం మంచిది అనిపిస్తుంది రాబోయ్ మనిషి గురించి నేను చెప్పను కానీ అరవింద్ బాబు స్థానంలోకి మరొకరు రావాలి.నువ్వేం మాట్లాడుతున్నావ్ నీకు అర్థం అవుతుందా అమ్మ నాకు అలాంటి ఆలోచనలు లేవు, అనుకున్నది సాధించుకోవడానికి పోరాటం చేస్తాను అని చెప్పి మల్లి వెళ్ళిపోతుంది. నా కూతురు ఒంటరిది కాకుండా దాని జీవితాన్ని బాగు చేయి తల్లి అని దేవతను ప్రార్థిస్తుంది మీరా.

అరవింద్ మల్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చెప్తుంటే వినడం లేదు ఇంక నేను తనని కాపాడలేను. మల్లి అరవింద్ బాబు గారితో మాట్లాడాలి అని ఫోన్ చేస్తుంది. నా మాటంటే లెక్కలేని మనిషి నాకెందుకు ఫోన్ చేస్తుంది అని అరవింద్ కట్ చేస్తాడు. మాలిని వచ్చి ఫోన్ చేస్తుంది మల్లినేనా ఎందుకు కట్ చేయడం సమాధానం చెప్పు సరిపోతుంది కదా అంటుంది మాలిని. మాలిని మల్లికి ఫోన్ చేసి తిడుతుంది. గౌతమ్ వచ్చి మల్లి ఫోన్ చెక్ చేస్తాడు అరవింద్ కి ఎందుకు కాల్ చేసావ్ అని అడుగుతాడు ఏం అడుగుదామని చేసావు నాకు అరవింద తో మాట్లాడటం ఇష్టం లేదని తెలుసు కదా నీ పద్ధతి నాకేం నచ్చడం లేదు ఇప్పుడు నువ్వు నా ఇంట్లో ఉన్నావు నేను చెప్పినట్టే వినాలి నాకు అనుకూలంగా ఉండాలి అని అంటాడు.