NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ ఫ్యాక్ట్ చెక్‌ రాజ‌కీయాలు

TTD: రాజాసింగ్ ఆరోపణల్లో నిజం లేదు .. వాస్తవం ఇది

Advertisements
Share

TTD:  టీటీడీ చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఏపీ సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో భూమన కరుణాకర్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్ లో క్రిస్టీయన్ గా పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఇది వివాదం అయ్యింది. దీనిపై గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు. అయితే వాస్తవానికి భూమన తన ఎన్నికల అఫిడవిట్ లో క్రిస్టియన్ గా పేర్కొనలేదని సమాచారం.

Advertisements

 

సోషల్ మీడియాలో జరుగుతున్నది అసత్య ప్రచారంగా పేర్కొంటున్నారు. ఇంతకు ముందు వైవీ సుబ్బారెడ్డి నియామక సమయంలోనూ ఇదే విధంగా విమర్శలు వచ్చాయి. క్త్రైస్తవ మతం ఆచరిస్తున్న వైఎస్ఆర్ కుటుంబానికి వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు దగ్గరి బంధువులు కావడంతో అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

Advertisements

భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో తాను క్రిస్టియన్ అని ఎక్కడా ప్రకటించలేదు. సాధారణంగా ఎన్నికల అఫిడవిట్ లో ఒక అభ్యర్ధి తన మత విశ్వాసాల గురించి తెలియజెప్పాల్సిన అవసరం లేదు. అయితే కరుణాకర్ రెడ్డి తన కుమార్తె నీహా రెడ్డి వివాహం వైఎస్ రవీంద్రారెడ్డి కుమారుడితో (వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు) జరిగింది. వైఎస్ కుటుంబం క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుండటం వల్ల వారి వివాహం క్రైస్తవ పద్ధతిలో జరిగింది. కానీ భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం హిందూ మతాన్నే ఆచరిస్తున్నారు. మరో పక్క కరుణాకర్ రెడ్డి కుమారుడి వివాహం హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగింది. భూమన గతంలో 2006 నుండి 2008 వరకూ కూడా టీటీడీ చైర్మన్ గా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారు. టీటీడీలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు.

త్రివిధ దళాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి


Share
Advertisements

Related posts

హీరోయిన్ గా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ పుష్ప లో ఐటెం సాంగ్ ఎలా చేస్తుందనుకున్నారు ..?

GRK

వీల్ చైర్ తోనూ సాహ‌సాలు చేస్తున్న‌ వీరుడు!

Teja

Pawan Kalyan: కొడుకు కెరీర్ ని ప్రాణస్నేహితుడు చేతిలో పెట్టిన పవన్ కళ్యాణ్..??

sekhar