NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ద‌ఫా ప‌రిటాల సునీత విజ‌యం ఖాయ‌మే నా? ఆమె గెలుపు గుర్రం ఎక్కుతారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. స్థానికంగా మార్పును కోరుకుంటున్నార‌ని తెలుస్తోంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి విష‌యంలో స్థానికంగా ఉన్న వ్య‌తిరేక‌త‌.. సునీత‌కు ప్ల‌స్ కానుంద‌ని తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో మ‌హిళా సెంటిమెంటు కూడా మ‌రోసారి క‌లిసి రానుంద‌ని తెలుస్తోంది.

2009. 2014 ఎన్నిక‌ల్లో సునీత విజ‌యం ద‌క్కించుకున్నారు. చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలో ప్లేస్ కూడా పొం దారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌త్యేక అభివృద్ధి చేశారు. దీనికితోడు.. కియా సంస్థ రాక వెనుక కూడా మంత్రిగా ఆమెప్ర‌య‌త్నం కూడా ఉంది. ఇప్పుడు ఇవ‌న్నీ.. ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె చేస్తు న్న ప్ర‌చారానికి కూడా.. మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ముఖ్యంగా గ‌డిచిన ఐదేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉండడం.. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ముందుకు తీసుకువెళ్ల‌డంలో సునీత స‌క్సెస్ అయ్యారు.

చంద్ర‌బాబు నుంచి ఎలాంటి సూచ‌న‌లు వ‌చ్చినా.. ముందున్నారు. ఆయ‌న చెప్పిన ప్ర‌కార‌మే కార్య‌క్ర‌మా ల‌ను ముందుకు తీసుకువెళ్లారు. కేడ‌ర్‌లోనూ బ‌ల‌మైన నాయ‌కురాలిగా వ్య‌వ‌హ‌రించారు. ఇక, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్న కుటుంబంగా పేరు తెచ్చుకున్నారు. ఇవ‌న్నీ ప‌రిటాల కుటుంబానికి ఇప్పుడు ప్లస్ అయ్యాయి. ఇక శ్రీరామ్‌కు ఎలాగూ ధ‌ర్మ‌వ‌రం సీటు ద‌క్క‌లేదు. పొత్తులో ఆ సీటు బీజేపీకి వెళ్ల‌డంతో ఇప్పుడు శ్రీరామ్ కూడా రాఫ్తాడులో త‌న‌దైన వ్యూహాల‌తో ముందుకు వెళుతున్నారు.

ఇక‌, వైసీపీ వ్య‌తిరేక‌త ఎలా ఉన్నా.. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేపై మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. తోపుదుర్తి సోద‌రులు అంతా తామే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన తీరు.. ప్ర‌తి ప‌నికీ.. లంచాలు తీసుకున్నా ర‌న్న వాద‌న ఏ స‌మ‌స్య చెప్పుకొందామ‌న్నా.. అందుబాటులో లేక పోవ‌డం.. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు ఇస్తున్నాం.. రోడ్డు ఎందుకు? అని గ‌తంలో చేసిన ప్ర‌కట‌న‌లు వంటివి ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు చెప్ప‌డంలో సునీత విజ‌యం సాధించారు. దీంతో రాప్తాడులో సునీత విజ‌యం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. గ‌తంలో త‌మ‌కు అందుబాటులో ఉన్న సునీతను గెలిపించుకుంటామ‌ని.. స్థానికులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju