YS Viveka Case: కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పై ఉన్న కేసుల విషయంలో భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. వివేకా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, వివేకా కుమార్తె తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా వాదనలు నిన్న వాదనలు వినిపించగా, సీబీఐ వాదనల నిమిత్తం న్యాయమూర్తి విచారణను శుక్రవారం (ఈ రోజు)కు వాయిదా వేశారు. వివేకా హత్య కేసులో కిరాయి హంతకుడు బయట తిరిగేందుకు పూర్తిగా సహకరిస్తున్న సీబీఐ .. ఎలాంటి సాక్ష్యాలు, అధారాలు లేకుండా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ని అరెస్టు చేయడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తొందని అవినాష్ రెడ్డి తరపు నిరంజరన్ రెడ్డి వాదనలు వినిపించారు.

అవినాష్ ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే దర్యాప్తు చేస్తొంది తప్ప ఇతర కీలక అంశాలను పట్టించుకోవడం లేదన్నారు. సీబీఐ ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్తావిస్తూ అవినాష్ ను అరెస్టు చేయాలని చూస్తొందని, కానీ అందులో ఏ ఒక్క దానికీ అధారాలు లేవని, అన్నీ ఉహాజనితాలు, కల్పితాలేనని వాదించారు. కస్టడీ విచారణ హజరు కావడానికి అవినాష్ సిద్దంగా ఉన్నారనీ, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నిరంజన్ రెడ్డి న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. సునీత తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపిస్తూ హత్యా స్థలంలో సాక్ష్యాల ధ్వంసంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. రక్తపు మరకలను తుడిచి వేయాలంటూ అవినాష్ రెడ్డి చెప్పినట్లు ఆ పని చేసిన మహిళ వాంగ్మూలం ఇచ్చారనారు. రక్తపు మడుగులో వివేకా మృతదేహం ఉన్నప్పటికీ గుండెపోటుగా చెప్పారన్నారు. అలానే చెప్పాలని సీఐని బెదిరించారన్నారు. అయితే రక్తపు మరకలు శుభ్రం చేసిన మహిళ తర్వాత మాట మార్చిందన్నారు. మూడు సిట్ బృందాలు దర్యాప్తు చేపట్టినప్పటికీ ఇది సక్రమంగా సాగకపోవడంతో సీబీఐకి బదలాయించారన్నారు.
సీబీఐ దర్యాప్తు చేపట్టిన తర్వాత పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు సునీత తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా. అవినాష్ రెడ్డి పై కేసులే లేవు అనడం వాస్తవం కాదనీ, తనపై హత్యాయత్నం కేసు నమోదైందని ఆయన ఎన్నికల అపిడవిట్ లోనే పేర్కొన్నారన్నారు. అవినాష్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ లో నాలుగు కేసులు పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ అవినాష్ రెడ్డిపై కేసులు లేవు అన్నట్లు సమాచార హక్కు కింద ప్రభుత్వం ఇచ్చిన సమాచారం కంటే అధారం ఏమి కావాలని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వమే మీదని సునీత తరపు న్యాయవాది వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో కుట్ర బయటికి రావాలంటే ఈ దశలో పిటిషనర్ కు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని అన్నారు. ఇవేళ సీబీఐ తరపు వాదనలు న్యాయస్థానం విననున్నది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. నిన్ననే ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను కూడా తెలంగాణ హైకోర్టు రద్దు చేయడంతో అవినాష్ రెడ్డి అనుచరుల్లో మరింత టెన్షన్ పెరిగింది.
ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. 1229 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు..ఎందుకంటే..?