అనంతపురం జిల్లాలో ఫేషియల్ యాప్ అటెండెన్స్ ఆలస్యంగా వేసిన 1229 మంది ఉపాధ్యాయులకు డీఇఓ సాయి రాం గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉద్యోగుల ఆన్ లైన్ హజరు పాఠశాల అటెండెన్స్ యాప్ లో దాదాపు 1229 మంది ఈ నెల 26వ తేదీన సరైన సమయంలో తమ హజరు నమోదు చేసి ఉండనట్లుగా సీఎస్ఈఐటీ సెల్ వారు పంపిన నివేదిక ఆధారంగా గమనించామని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.

పాఠశాల విధులు ఉదయం 7,45 గంటలకు ప్రారంభమైనప్పటికీ మీరు నిర్ణీత సమయంలో గా మీ హజరును ఆన్ లైన్ లో నమోదు చేయలేదు ఈ అంశానికి సంబంధించి మీ సంజాయిషీని వెంటనే లిఖిత పూర్వకంగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి పంపించాల్సిందిగా ఆదేశించారు.
BRS: టార్గెట్ @ 100 .. పార్టీ సర్వసభ్య సమావేశంలో సీఎం కేసిఆర్ కీలక వ్యాఖ్యలు