BRS: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలకు హెచ్చరిక లు జారీ చేశారు. భవిష్యత్ కార్యాచరణ పై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచామనీ, వచ్చే ఎన్నికల్లో వంద కు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కేసిఆర్.

తమ ప్రభుత్వం అధికారంలోకి రావడం అనేది పెద్ద టాస్క్ కాదని, మునుపటి కంటే ఎక్కువ సీట్లు రావాలనేదే ప్రాధాన్యత అంశమని కేసిఆర్ పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలన్నారు. షెడ్యుల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలన్నారు. సిట్టింగ్ లు అందరూ జాగ్రత్తగా పని చేయాలన్నారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలని, కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టాలన్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంతో పాటు నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ ను చేపట్టాలని చెప్పారు. దళిత బంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద ఉందని, ఆ ఎమ్మెల్యేలకు ఇదే తన చివరి హెచ్చరిక అని అన్నారు. మరో సారి తప్పు చేస్తే పార్టీ నుండి తప్పిస్తామని స్పష్టం చేశారు. అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యత అని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలోనూ ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు వ్యక్తిగత ప్రతిష్టలకు పోకుండా పార్టీ కోసం కలిసి పని చేయాలని సూచించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని అన్నారు. పార్టీ సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు.
Karnataka Assembly Polls: హోంమంత్రి అమిత్ షా పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
