Karnataka Assembly Polls: కర్ణాటకలో మరో రెండు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. ప్రచార పర్వంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్దం జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సుర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్, డీకే శివకుమార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రజల్లో విధ్వేషాలు రెచ్చగొట్టేలా తప్పుడు వ్యాఖ్యలు చేశారుని, ప్రతిపక్ష పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించారంటూ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత కాంగ్రెస్ నేత సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ .. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయని అమిత్ షా అన్నారన్నారు. పీఎఫ్ఐ సంస్థపై నిషేదం ఎత్తివేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని తప్పు వ్యాఖ్యలు చేశారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి కర్ణాటకలో మతసామరస్యాన్ని చెడగొట్టి, కాంగ్రెస్ కు దురుద్దేశాలను అంటగడుతున్నారని మండిపడ్డారు. బాగాల్ కోట్ లో మంగళవారం జరిగిన బీజేపీ ర్యాలీలో అమిత్ షా ప్రతిపక్షంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కు పొరపాటున ఓటు వేస్తే అవినీతిని మునుపెన్నడూ చూడని స్థాయిలో పెంచేసినట్లేనని అమిత్ షా వ్యాఖ్యానించారు.
AP Govt: ఏపి సర్కార్ కు స్కోచ్ గోల్డ్ అవార్డు ..అధికారులను అభినందించిన సీఎం జగన్