ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: జగన్ దగ్గర నుండి సామాన్య కార్యకర్త వరకూ వైసీపీలో అందరూ ఆ యువ ఎమ్మెల్యే గురించే డిస్కషన్..

Share

YSRCP: వైసీపీ యువ ఎమ్మెల్యేలలో విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ ఒకరు. సీఎం వైఎస్ జగన్ కు వీర విధేయుడుగా పేరుంది. మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన అమరనాథ్ మంచి వాగ్దాటితో దూకుడుగా వ్యవహరిస్తుంటారు. అమరనాథ్ దూకుడు స్వభావం నచ్చిన వైఎస్ జగన్మోహనరెడ్డి జిల్లాలో ఎంత మంది సీనియర్ లు ఉన్నా వారందరినీ కాదని వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 2014 ఎన్నికల్లో జగన్ అనకాపల్లి ఎంపీ టికెట్ అమరనాథ్ కు ఇవ్వగా ఆ ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. అయినప్పటికీ పార్టీ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఉండటంతో 2019 ఎన్నికల్లో సీనియర్ నేత దాడి వీరభద్రరావు కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి అమరనాథ్ కు అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు జగన్. ఈ ఎన్నికల్లో 8 వేల పైచికులు ఓట్ల మెజార్టీతో అమరనాథ్ గెలుపొందారు.

YSRCP young mla visakha
YSRCP young mla visakha

YSRCP: మంత్రి పదవి పక్కా అంటూ హుషారు

ఇటీవలే అమరనాథ్ కు అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఇదే సమయంలో అమరనాథ్ పుట్టిన రోజు వేడుకలు రావడంతో క్యాడర్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. యంగ్ డైనమిక్ లీడర్ గుడివాడ అంటూ ప్రచారం స్టార్ట్ చేశారు ఆయన అభిమానులు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అభినందన పోస్టర్ లు ఏర్పాటు చేశారు. అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు. త్వరలో మంత్రి వర్గ ప్రక్షాళన కూడా జరగనున్న నేపథ్యంలో తమ నాయకుడికి మంత్రి పదవి పక్కా అంటూ హుషారు చేస్తున్నారు అభిమానులు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి విశాఖ జిల్లాలో అమరనాథ్ కు జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం జరిగితే విశాఖ జిల్లా నుండి తమ నాయకుడిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని బలంగా విశ్విస్తున్నారు ఆయన క్యాడర్.

YSRCP: అభిమానుల కోరికను జగన్ నెరవేరుస్తారో లేదో

ఓ పక్క కరోనా కారణంగా జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ హోం క్వారంటైన్ లో ఉండగా, కాబోయే మంత్రి గుడివాడ అంటూ ఆయన అనుచరులు హాల్ చల్ చేస్తున్నారు. కాబోయే మినిస్టర్ అనే పిలుస్తున్నారు. మరో పక్క విజయసాయిరెడ్డితోనూ అమరనాధ్ మంచి ర్యాపో మెయింటెన్ చేస్తున్న నేపథ్యంలో మంత్రిపదవికి ఎటువంటి అడ్డంకులు ఉండవని ఆయన అభిమానులు భావిస్తున్నారు. జిల్లాలో ఈ విషయమే హాట్ టాపిక్ గా నడుస్తోంది. క్యాడర్ హంగామా సీఎం జగన్ వద్దకు కూడా చేరిందని అంటున్నారు. ఈ అభిమానుల కోరికను జగన్ నెరవేరుస్తారో..? లేదో..? వేచి చూడాలి.


Share

Related posts

గుడ్లలో రంగు ద్వారా మంచివో కావో తెలుసుకోండి ఇలా !

Kumar

coronavirus: ముఖ్యమంత్రులు కాపాడుతుంటే మోదీ ముంచేశాడు! వామ్మో… ఇది మారణహోమం

arun kanna

Etela Rajendar Comments: కేసీఆర్ పై ఈటెల తీవ్ర వ్యాఖ్యలు..! వారి సంగతి చూస్తా అంటూ ఘాటుగా..!!

Srinivas Manem
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar