NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ప్రియమైన కాంగ్రెస్ నే నమ్ముకున్న మూర్ఖులారా !!

ఎన్నో తర్జనభర్జనల అనంతరం చివరికి సోనియా గాంధీ మళ్లీ జాతీయ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఇది అందరికీ తెలిసిన మాట. కానీ లోపల జరిగిన విషయం వేరే అని ఈ తంతు అంతా రియాలిటీకి చాలా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంటే మన గాంధీ కుటుంబానికి… సీనియర్ నేతలకు సరిగ్గా పడడం లేదని చెబుతున్నారు. అసలు సంగతి ఏంటో ఒక సారి చూద్దాం….

 

ఇరుకున పడేశారే….

ముందు నుండి అందరూ అంటున్నట్టు అసలు పార్టీలో రాహుల్ గాంధీ పాత్ర ఏమీ లేదట. అతను నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ససేమిరా అన్నాడు. ప్రియాంక గాంధీ కూడా పెద్ద సముఖంగా లేదు. ఇక వీరిద్దరూ అందుకున్న కొత్త పాట ఏమిటంటే తమ కుటుంబం నుండి కాకుండా ఈసారి కొత్త మనిషికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని అనుకుంటున్నారట. అయితే ఇదే సమయంలో సీనియర్ నేతలు 23 మంది సోనియా గాంధీకి లేఖ రాయడంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ కూడా లేఖను తప్పు పట్టారు. సీనియర్ల వ్యవహారశైలి సరిగా లేదని భావించారు దీంతో ఒక్కసారిగా వారికి ఏం చేయాలో అర్థం కాలేదు.

 

అయ్యో…. పాపం..!

ఒకవైపు నుండి వస్తున్న మాటలు ఏమిటంటే గులాంనబీ ఆజాద్ వంటి నేతలకు ఈ మధ్య కాంగ్రెస్ హైకమాండ్ నుండి అపాయింట్మెంట్ లభించట్లేదు. అధ్యక్షుడు ఎవరో ఒకరిని ఉద్దేశించి అపాయింట్మెంట్ అడుగుదామంటే ఎవరూ కనిపించట్లేదు. సోనియాకి స్వయంగా వివరణ ఇవ్వాలని ఉన్నా ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కుదరడం లేదు. ఇక రాహుల్ గాంధీ పాత్ర ఏమిటో అతనికే అవగాహన లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు కిక్కు దిగింది. దశాబ్దాల కాలం పాటు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళు ఈ సమయంలో వేరే పార్టీకి వెళ్ళలేరు…. తాము నాయకులుగా ఎదిగేందుకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ను వదులుకోలేరు. వాళ్ల పరిస్థితి చివరికి అటూ ఇటూ కాకుండా అయిపోయింది.

ఇదే వారు చేసిన తప్పు..

ఇక విశ్లేషకులు చెబుతున్న మాట ఏమిటంటే…. సోనియాగాంధీ అధ్యక్షురాలు పదవికి ఫిక్సయిపోయింది…. కాంగ్రెస్ సీనియర్ నేతలు మనసులో కూడా అదే ఉంది కానీ కొన్ని ముఖ్య పదవుల నుండి సీనియర్ నేతలను తప్పించి యువకులను ఇవ్వటాన్ని ప్రోత్సహించేందుకు ఇదంతా రాహుల్ గాంధీ ప్లాన్ అట. ఇదే సమయంలో సీనియర్లలో అసమ్మతి మొదలైతే పార్టీకి నష్టమని కావాలని వారు రాసిన లేఖలను సాకు పెట్టుకొని వారిని సీడ్బ్ల్యూసీ మీటింగ్ లో ఇష్టం వచ్చినట్లు కడిగిపారేసి తమ అదుపులో పెట్టుకున్నారట. ఇక గాంధీ కుటుంబం ఆడిందే ఆట…. పాడిందే పాట. పార్టీని నమ్ముకొని ఉన్న వారి పట్ల ఏ మాత్రం గౌరవం, కృతజ్ఞత భావం లేకుండా హైకమాండ్ వ్యవహరిస్తోంది అన్న వాదనలు వస్తున్నాయి. ఇక వీరు తమ బాధను వెల్ల్గక్కలేరు… జూనియర్లు రాజ్యం ఏలుతుంటే… చూసి ఓర్వలేక కాబట్టి ఒకే పార్టీని నమ్ముకుని ఎక్కువగా ఉండడం కూడా చివరికి చేటు అయిపోయిందని వారు వాపోతున్నారట.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !