NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

జగన్ – మోదీ మరింత దగ్గరగా..! వచ్చే వారమే ముహూర్తం..!!

వైసీపీ..ఎన్ డి ఎలో చేరబోతుంది అనడానికి అనేక సంకేతాలు ఉన్నాయి. అదే సందర్భంలో వైసీపీ ఎన్ డీ ఎలో చేరదు అనడానికీ కొన్ని సంకేతాలు ఘోషిస్తున్నాయి. ఇంతకూ వైసీపీ..ఎన్ డీ ఏలో చేరుతుందా? చేరదా? వైసీపీ పెద్దలు కొంత మందికి కేంద్ర మంత్రి పదవులు వరిస్తాయా? వరించవా? అనేది ఆ పార్టీ వర్గాల్లో అది పెద్ద చర్చ..! మొన్న సీఎం జగన్..అమిత్ షా ను రెండు సార్లు కలవడం. కలిసి వచ్చిన తరువాత వివిధ మీడియాలు వివిధ రకాలుగా రాసుకుంటూ చివరకు వైసీపీ ఎన్ డి ఎలో కలవడానికే అమిత్ షా పిలిపించారు అనే వాస్తవం బయటకు రావడం ఇదంతా చెకచెకా జరిగిపోయాయి. అయితే ఎన్ డీ ఎలోకి వైసీపీ అనడానికి మరో పెద్ద కారణం వచ్చే వారంలో కనిపించనున్నది. అది ఏమిటంటే సీఎం జగన్.. మోడీని కలవనున్నారు. తేదీ, ముహూర్తం ఇంకా ఫిక్స్ అవ్వలేదు కానీ ఢిల్లీ నుండి కబురు వచ్చింది, వచ్చే వారం ఎప్పుడైనా జగన్ వెళ్లి మోడీని కలిసి రానున్నారు అనేది ప్రస్తుతానికి వార్త.

ap cm ys jagan, pm modi file photo

ఎన్ డి ఎలో చేరిక కాకపోతే మరి ఏమిటి..?

జగన్ కొద్ది రోజుల వ్యవధిలోనే ఢిల్లీకి వెళ్లడం, వరుసగా అమిత్ షా ను రెండు సార్లు కలవడం, మళ్లీ ప్రధాని మోడీ నుండి పిలుపు రావడం, వెళ్లి కలవడం,ఈ సంగతి పక్కన పెడితే..ఎన్ డి ఎ నుండి ఒక్కో పార్టీ జారుకోవడం, గత ఏడాది ఎన్నికలకు ముందు టీడీపీ, ఆ తరువాత శివసేన, తాజాగా అకాళీదళ్ ఇలా ప్రాంతీయ పార్టీలు ఎన్ డి ఎ నుండి జారుకోవడం, ఎన్ డి ఎకి రాజ్యసభలో అవసరాలు పెరగడం, ఇవన్నీ చూస్తుంటే బీజెపికి దక్షిణాదిలో బలమైన మిత్ర పక్షం అవసరమైతే ఉంది. తమిళనాడులో అన్నా డీఎంకేని నమ్ముకుని ఉండలేరు. తెలంగాణలో కెసిఆర్ ను అసలే నమ్మరు. ఇక ఎపిలో చంద్రబాబు ఎప్పుడు ఏమి మాట్లాడతారో, ఏమి రాజకీయం చేస్తారో, ఏ చీకటి బాగోతాలు చేస్తారో తెలియదు. ఆయనను అస్సలు నమ్మరు. అందుకే జగన్ అంటే ఎలాగూ మన చేతిలోనే ఉంటాడు,ఉంకపోతే ఆయన కేసులు ఉంటాయి అని బీజెపి పేద్దలకు బాగా తెలుసు. అందుకే ఎన్ డి ఎలోకి ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించాలి, చేర్చుకోవాలి అంటే ఇప్పుడు మొదట కనిపిస్తున్న పార్టీ వైఎస్ఆర్ సీపీ.

chandrababu, pm modi file photo

చేరితే జగన్ కు నష్టాలు ఉన్నాయి..! అందుకే ఈ తటపటాయింపు..!!

జగన్ కు ఎన్ డి ఎలో చేరడానికి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే జగన్ కు మొదటి నుంచి మద్దతుగా నిలుస్తున్న వర్గాలు దూరమవుతాయేమోనన్న ఒక భయం తప్ప. జగన్ ను 2012లో పార్టీ పెట్టినప్పటి నుండి ఆదరిస్తున్న వర్గాల్లో క్రీస్టియన్లు, మైనార్టీలు ముందు ఉన్నారు. వాళ్లంటే బీజేపీకి అసలు పడదు. బీజెపి వాళ్లంటే అసలు పడదు. వీళ్లకు బీజేపీ అంటే పడదు. మరి ఈ తరుణంలో జగన్ వెళ్లి ఎన్ డీ ఎలో కలిస్తే చూసి చూసి తన చేతిలోని తన సొంత వర్గాలను దూరం చేసుకున్నట్లే కదా. ఆ భయం జగన్ ను వెంటాడుతోంది. బీజెపీ హిందూ వాదం, మత రాజకీయాలు, జగన్ కు పెద్దగా ఎక్కకపోవచ్చు. కానీ జగన్ కు ఉన్న అవసరాలు, ఆయనపై ఉన్న కేసులు, కొన్ని చీకటి ఒత్తిళ్ళు జగన్ ను ఎన్ డీ ఎ లోకి వెళ్లేలా, బీజెపికి తలవగ్గేలా చేయడంలో ఆశ్చర్యం అయితే లేదు. ఏమో వచ్చే వారం ఏమి జరుగుతుందో చూద్దాం..!! ఏమి జరిగినా చంద్రబాబు మాత్రం జగన్ కంటే ముందే బీజెపీతో ప్రెంఢ్ షిప్ కోసం ప్రయత్నిస్తున్నారు అనడానికి మాత్రం సందేహం, అనుమానాలు ఏమి అక్కరలేదు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N