అచ్చెన్నాయుడు కే టిడిపి కిరీటం: చంద్రబాబునాయుడు ఫిక్స్ !

Share

అనివార్య పరిస్థితుల్లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఏపి టిడిపి అధ్యక్ష పదవి కట్టబెట్టాలని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు.

chandrbabu naidu fix to declare atchannaidu is the king of tdp
chandrbabu naidu fix to declare atchannaidu is the king of tdp

ఈనెల 4వ తేదీన చంద్రబాబు నాయుడు ఈ మేరకు ప్రకటన చేయనున్నారని పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. ఈఎస్ఐ స్కామ్ లో జైలుకు కూడా వెళ్ళి వచ్చిన అచ్చెన్నాయుడు పై ఒక్కసారిగా చంద్రబాబుకు ప్రేమ పెరిగిపోయింది. పైగా అచ్చెన్నాయుడు పదవి ఇవ్వడం ద్వారా బీసీలను ఆకట్టుకోవచ్చు నన్న ఇంకో లెక్క కూడా ఆయన వేశారు. రాజకీయాల్లో దూకుడుగా ఉండే అచ్చన్నాయుడు ఈ పదవికి సరి అని చంద్రబాబు మనసావాచా భావిస్తున్నారట.నిజానికి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులను ప్రకటించినప్పుడే రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా చంద్రబాబు భర్తీ చేయాల్సి ఉంది.అయితే చినబాబు లోకేష్ అడ్డు చెప్పడంతో చంద్రబాబు వెనకడుగు వేశారని సమాచారం.

కానీ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది.ముఖ్యంగా ఉత్తరాంధ్రలో టిడిపి జెండా కట్టే పట్టే నాయకుడు కార్యకర్త కరువయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.విశాఖపట్నంలో టిడిపికి నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా ఒక్క వెలగపూడి రామకృష్ణబాబు మినహా మిగిలిన ముగ్గురు వైసీపీ వైపు వెళ్ళి పోతున్నారని టిడిపి అధినేత కే సమాచారం అందింది.ఇప్పటికే గ్రేటర్ విశాఖ అధ్యక్షుడు విశాఖ నార్త్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసిపికి మద్దతు ప్రకటించారు.గంటా శ్రీనివాసరావు గణ బాబులు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో టిడిపి మనుగడ సాగించాలంటే ఈ ప్రాంతానికి చెందిన అచ్చెన్నాయుడుకు పదవి ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని పార్టీ వర్గాలు కూడా మొత్తుకుంటున్నాయి.చంద్రబాబు కూడా అన్ని సమీకరణాలు చూసుకున్నాక అచ్చన్నాయుడును అందల మెక్కి౦చడానికి సిద్ధపడి పోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ మేరకు సమాచారం అందడంతో అచ్చెన్నాయుడు అమరావతికి పయనమయ్యారు.శనివారం నాడు ఉత్తరాంధ్ర పార్టీ అగ్ర నాయకులతో చంద్రబాబు తుది సమీక్ష నిర్వహించి నాలుగోతేదిన అచ్చెన్నాయుడుకి పార్టీ కిరీటం పెడతారని విశ్వసనీయ వర్గాల భోగట్టా! ఏం జరుగుతుందో వేచి చూద్దాం!


Share

Related posts

జగన్ మడమ తిప్పినట్టేనా..ఆ ప్రతిపాదన విత్ డ్రా…!!?

Special Bureau

బాబుపై వైకాపా మినిస్టర్ కి సాఫ్ట్ కార్నర్!

CMR

మంత్రి విశ్వరూప్ బెదిరింపు వ్యాఖ్యలు..!!

sekhar