NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

రాహుల్ గాంధీ మొండి పట్టు .. గట్టి భవిష్యత్తు కోసమేనా ?

చివరికి రాహుల్ గాంధీ  అధ్యక్ష బాధ్యతలను చేపట్టడు అని తేలిపోయింది. ఎవరో ఒకరిని అయితే కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాల్సి ఉన్నది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగనున్నారు. అయితే ఆమె స్థానంలో మళ్లీ రాహుల్ రాకపోవడానికి కారణం ఏమిటి? ఇంతకీ అది పార్టీ మంచి కోసమేనా..?

CWC Meeting Updates: Sonia Gandhi To Be Interim President

విమర్శకుల నోర్లు మూయించేందుకే..?

ముఖ్యంగా సీనియర్ నేతలు రాహుల్ గాంధీనే తిరిగి పదవి చేపట్టాలని కోరుకుంటున్నారు. అయితే రాహుల్ చివరికి ససేమిరా అనేశాడు. ఆయన పదవి చేపట్టేందుకు ఇప్పటికే ఇష్టపడడం లేదు. ఇందుకు ముఖ్య కారణం బీజేపీ నేతలు పదేపదే గాంధీ కుటుంబమే కాంగ్రెస్ ను ఏలుతుంది అంటున్నందునే అట. కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టే అవకాశమే లేదని విమర్శలు చేస్తున్న దశలో…. రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. ఇలాంటి దశలో ఇలాంటి విమర్శలు ఎప్పటి నుండో వస్తున్నవి అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితి వేరు.. అప్పుడున్న పరిస్థితిలు లేరు. కాబట్టి రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతుంటారు.

పైపెచ్చు ఇదే మేలు

ఇకపోతే తాను అధ్యక్ష పదవిలో ఉండటం కంటే బ్యాక్ సీట్ లోనే ఉండి బండిని నడపడం మంచిదని రాహుల్ గాంధీ భావిస్తున్నాడు. కొత్త అధ్యక్షుడు తీసుకున్న ఏ నిర్ణయమైనా సమష్టి గా తీసుకుంటారు కాబట్టి ఎలాంటి సమస్యలు ఉండవు. తన అభిప్రాయాలకు కూడా సీనియర్ నాయకులు ఇచ్చే విలువ అలాంటిది. దీంతో పాటు తాను ఎటువంటి ఒత్తిడి లేకుండా సులువుగా ఎక్కడికైనా పర్యటించే వీలుంటుంది. తన పై అధికార పార్టీ ఫోకస్ తగ్గుతుంది. అవసరమైతే ఎన్నికల సమయానికి ఎలాగూ లీడ్ పాత్ర పోషిస్తాడు. ఇక ఇబ్బందేముంది? రాహుల్ అభిప్రాయం కూడా ఇదే అన్నట్లు ఉంది

నాణేనికి మరో వైపు

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ సోదరి కూడా గాంధీ కుటుంబీకులు కాకుండా ఎవరైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టవచ్చని ప్రకటించిన పిమ్మట సోనియాగాంధీ మళ్లీ తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగా లేదు. అటువంటి సమయాల్లో రాహుల్ బాధ్యతలు చేపట్టాలని అంతా కలిసి నిర్ణయించుకున్నారు. తిరిగి తిరిగి గాంధీ కుటుంబమే పార్టీ పగ్గాలు చేపట్టారు. ఇక విమర్శలు ఎలా అగుతాయి? కావాలని డ్రామా చేశారనిఅవకాశవాద రాజకీయాలు నడిపారని వారి కుటుంబాన్ని విమర్శకులు ఊచకోత కోసేందుకు ఆల్రెడీ రెడీ అయిపోయారు.

మొత్తానికి కాంగ్రెస్ పంథా ఎంచుకోవడంలో విఫలమైందని అంటున్నారు. అసలు ఇంకొకరికి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో కనీసం ట్రై చేసేందుకు కూడా వారి వెనకాడుతున్నారని…. ఒకటే డప్పు మరి వీటన్నింటికీ సోనియా సమాధానం చెబుతుందా? రాహుల్ రిప్లై ఇస్తాడా?

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju