ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ చిత్రాలకు హీరో వెంకటేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయాడు. అందరి హీరోలతో కలిసి పనిచేయడానికి ఆసక్తిని చూపుతున్నాడు. మల్టీస్టారర్ కథలను తయారు చేసుకునే దర్శకులు కూడా వెంకటేష్‌ను దృష్టిలో పెట్టుకునే కథలు రాసేస్తున్నారు. ఈ ఏడాది ఎఫ్ 2లో వరుణ్‌తేజ్‌తో కలిసి నటించిన వెంకటేష్.. ఇప్పుడు మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీమామ చేస్తున్నాడు. దీని తర్వాత కూడా వెంకటేష్ మల్టీస్టారర్ సినిమానే చేయబోతున్నాడట. వెంకటేష్.. రానా కలిసి ఆ సినిమా చేస్తారని వార్తలు వినిపించాయి కానీ.. ఇప్పుడు రానా స్థానంలో రవితేజ చేయబోతున్నాడని అంటున్నారు. `బిందాస్`, `రగడ` చిత్రాల దర్శకుడు వీరుపోట్ల వెంకటేష్, రవితేజలతో మల్టీస్టారర్ తెరకెక్కిస్తాడని సమాచారం. పోలీస్, దొంగ మధ్య నడిచే మైండ్ గేమ్ లాంటి సినిమా ఇది అని.. అనీల్ సుంకర సినిమాను నిర్మిస్తాడని అంటున్నారు.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!