కర్నాల్ (హరియాణా): హరియాణాలోని కర్నల్ ప్రాంతంలో మహిళా కళాశాల ప్రొఫెసర్ ఒకరు విద్యార్థినులకు ‘ప్రేమ సూత్రాలు’ చెబుతూ అడ్డంగా దొరికేశారు. దాంతో ఆయనను సస్పెండ్ చేశారు. సదరు ప్రొఫెసర్ చెబుతున్న ప్రేమపాఠాలను ఒక విద్యార్థిని తన సెల్ ఫోనులో రికార్డు చేసింది. దాన్ని ప్రిన్సిపాల్ కు చూపించడంతో చరణ్ సింగ్ అనే సదరు ప్రొఫెసర్ రాతపూర్వకంగా విద్యార్థినులకు క్షమాపణ చెప్పారు. తర్వాత ఆయనను సస్పెండ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో బ్లాక్ బోర్డు మీద చరణ్ సింగ్ రాసినట్లు వీడియోలో ఉంది. ‘‘క్లోజ్ నెస్ – ఎట్రాక్షన్ = ఫ్రెండ్ షిప్’’, ‘‘క్లోజ్ నెస్ + ఎట్రాక్షన్ = రొమాంటిక్ లవ్’’, ‘‘ఎట్రాక్షన్ – క్లోజ్ నెస్= క్రష్’’ అని రాశారు.
https://youtu.be/L-39a3y8YpA
ప్రొఫెసర్ చరణ్ సింగ్ హిందీలో ఈ ఫార్ములాను రాసి, ప్రతి పదాన్నీ అమ్మాయిలకు వివరించాడు. భార్యా భర్తల మధ్య పెద్ద వయసులోను, వాళ్లు స్నేహితులైన తర్వాత ఆకర్షణ ఎలా పోతుందో సింగ్ వివరించారు. ప్రొఫెసర్ ప్రతి సూత్రాన్ని వివరిస్తుంటే విద్యార్థినులు నవ్వడం కూడా వీడియోలో కనిపించింది. ప్రతి వివరణకు వాళ్లు అవునని అన్నారు. ఇంతకీ సదరు ప్రొఫెసర్ ఆ ప్రభుత్వ మహిళా కళాశాలకు కేవలం 6 నెలల డిప్యూటేషన్ మీదే వచ్చారు.