24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

KCR moves to become the 21st century Sathavahana with BRS
Share

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా నయా శాతవాహనుడు, తెలంగాణ సీఎం కేసిఆర్ పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) ని భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) గా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించడం జరిగిపోయింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఇవేళ తెలంగాణ భవన్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఇక జాతీయ స్థాయి రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు సిద్దమైయ్యారు కేసిఆర్. ఈ నెల 14న దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేసిఆర్.. కర్ణాటక, మహారాష్ట్ర తమ మొదటి కార్యక్షేత్రాలుగా ప్రకటించారు. నాడు శాతవాహనులు కూడా తెలంగాణలోని కోటిలింగాల రాజధానిగా చేసుకుని పాలన ప్రారంబించి రాజ్యాన్ని విస్తరించారు.

దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తొలి ప్రధాన రాజవంశం శాతవాహనులు అనేది అందరికీ తెలిసిందే. దక్షిణ భారతదేశంలో తొలి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. మౌర్యుల కాలంలో సామంతులుగా ఉండి కణ్వ వంశ కాలంలో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్న శాతవాహులు.. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కోటిలింగాల వద్ద నుండి పాలన ప్రారంభించి తరువాత ప్రస్తుత మహారాష్ట్రలోని ప్రతిష్ఠానపురం (పైఠాన్)ను రాజధానిగా, మలి శాతవాహనుల కాలం నాటికి అమరావతి (ధరణికోట) రాజధానిగా చేసుకొని నర్మాదా నదీ తీరం నుండి కృష్ణా – గోదావరి డెల్టా ప్రాంతం వరకూ సువిశాలమైన సామాజ్రాన్ని స్థాపించి పాలించారు. అంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలను శాతవాహన రాజులు పాలించారు.

ఇప్పుడు కేసిఆర్ కూడా అదే రీతిలో తన రాజకీయ పార్టీ బీఆర్ఎస్ ను ఇటు ఏపి, ఆటు మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తరించేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అక్కడి జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలిపారు కేసిఆర్. అదే విధంగా తెలంగాణకు మరొ పొరుగున ఉన్న మహారాష్ట్రలోనూ పర్యటించాలని గులాబిదళ పతి భావిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక జేడీఎస్ నేత కుమార స్వామి కేసిఆర్ కు పూర్తి మద్దతుగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికీ విచ్చేసి శుభాకాంక్షలు కూడా తెలిపారు కుమారస్వామి .మహారాష్ట్రలో ఇంతకు ముందు ఉద్దవ్ ఠాక్రేతోనూ భేటీ అయ్యారు కేసిఆర్.

మరో పక్క తెలంగాణ నుండి జాతీయ పార్టీగా విస్తరించి వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో అభ్యర్ధులను పోటీ పెడుతున్న ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీతో కేసిఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుతో పాటు హింధీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ ప్రజలను ఆకర్షించగలడం కేసిఆర్ కు ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండగా, ఉత్తరాదిన బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది.. మరో పక్క మోడీ షా ద్వయం నేతృత్వంలో బీజేపీ ఓ శక్తిలా తయారై ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏ మేరకు విజయాలను నమోదు చేసుకుంటుంది అనేది వేచి చూడాలి.

TRS to BRS: తెలంగాణలో కాంగ్రెస్ పతనానికి బీజం పడి పదమూడు ఏళ్ళు


Share

Related posts

Breaking: అమరావతి రాజధాని కేసులో ధర్మాసనం నుండి తప్పుకున్న సీజేఐ జస్టిస్ యూయూ లలిత్.. వేరే బెంచ్ కు బదిలీ

somaraju sharma

Weight Loss: ఈ డ్రింక్ తాగితే బరువు తగ్గడం ఖాయం..!!

bharani jella

మోడి స్కీమ్ : ప్రతీ ఒక్కరికీ 10000 రుణం… ఇలా అప్లయ్ చేయండి

arun kanna