TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

Share

TDP ChandraBabu:  విజయవాడ, Andhra: ఏపీలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల దెబ్బ నాటినుండి ఏపీలో జరుగుతున్న ప్రతి ఎన్నికలలో..టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతూనే వస్తోంది.. ప్రతిపక్ష పాత్ర ఏ మాత్రం పోషించలేని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలు కూడా ప్రభుత్వ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి నిరసనలు లేదా సోషల్ మీడియాలో ఫేక్ ప్రసారం చేసిన.. వెంటనే వైసీపీ ప్రభుత్వం చర్యలు.. తీసుకుంటూనే మరోపక్క కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ క్యాడర్ చాలావరకు భయాందోళనలో ఉంది. మరోపక్క అధినేత తీరు మాత్రం చాలా వెరైటీ గా ఉందని అంటున్నారు. పార్టీ కార్యకర్తలపై కేసులు వైసీపీ పెడుతూ ఉంటే మరోపక్క చంద్రబాబు తాజాగా రాష్ట్రంలో పర్యటిస్తున్న క్రమంలో ఆయన చేస్తున్న కామెంట్లు మరీ విడ్డూరంగా ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇటీవల శ్రీకాకుళం అదేవిధంగా భీమిలిలో పర్యటించిన సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు.. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ మీద ఎన్ని కేసులు ఉంటే.. అంత బాగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాము. తర్వాత మన  ప్రభుత్వం వచ్చాక ఆ కేసులు వేసిన వారి మీద ట్రిబ్యునల్ వేసి…తిరిగి వాళ్ళమీద కేసులు పెడతాం.. అని చెప్పారు. దీంతో బాబు గారి మాటలు కార్యకర్తలకి ధైర్యం చెప్పడానికా..? లేకపోతే.. ఆయన పొలిటికల్ మైలేజ్ కోసం వాళ్లని బలిపశువులు.. చేయడానికా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే సందర్భంలో ప్రభుత్వపరంగా కేసులు ఎదుర్కొంటున్న కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఇటీవల నారా లోకేష్ నీ కలిసిన సమయంలో .. కేసుల ప్రస్తావన తీసుకొచ్చిన క్రమంలో లోకేష్ కూడా వెరైటీ గా రియాక్ట్ అయ్యారు అని పార్టీ వర్గాల్లో టాక్. లోకేష్ పార్టీ కార్యకర్తలపై కేసులు గురుంచి మాట్లాడుతూ …మీ కేసులు ఏమోగానీ నాపై 11 కేసులు ఉన్నాయి.. అని బదులిచ్చారు అంట.

దీంతో ఆ కార్యకర్తలు అంతర్మథనంలో పడినట్లు టాక్. వాళ్లు మాత్రమే కాదు ఏపీ టీడీపీ క్యాడర్ చాలావరకూ ఈ రీతిగానే  ఆలోచన చేస్తున్నట్లు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మేటర్ లోకి వెళ్తే చంద్రబాబు, లోకేష్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళకి లీగల్ సెల్ ఉండటం మాత్రమే కాదు వాళ్ళ వెనకాల కొన్ని కోట్లు ఆస్తులు ఉంటాయి. కానీ కార్యకర్త అనేసరికి చిన్నపాటి ఉద్యోగం.. చేసుకుంటూనే మరోపక్క పార్టీ కోసం పని చేసే పరిస్థితి. ఇటువంటి తరుణంలో చంద్రబాబు లోకేష్ కార్యకర్తలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాదు కేసులు ఎక్కువ.. ఉంటే అంత మంచిదని.. వ్యాఖ్యలు చేయటం టీడీపీకే డామేజ్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కార్యకర్త పై కేసు అనేసరికి…కోర్టులు చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటది. ఒక కేసులో ఇరుక్కున్నారు అంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఈ క్రమంలో కేసు ఎదుర్కొన్న వ్యక్తి పై ఆధారపడిన కుటుంబం కూడా అన్ని రకాలుగా నలిగిపోయే పరిస్థితి ఉంటది. దీంతో ఇప్పుడు టీడీపీకి బలం అని చెప్పుకునే క్యాడర్.. పార్టీ కార్యకర్తలకి సంబంధించి కేసులపై బాబు, లోకేష్ తీరుపై అసహనం చెందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Share

Recent Posts

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

18 mins ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

1 hour ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

2 hours ago

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…

4 hours ago

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ తెర‌కెక్కించిన…

4 hours ago

అలాంటి సినిమాల‌పై మోజు ప‌డుతున్న ర‌ష్మిక‌.. కోరిక తీరేనా?

సౌత్‌తో పాటు నార్త్‌లోనూ వ‌రుస సినిమాలు చేస్తూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్న నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా.. తాజాగా `సీతారామం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళ…

5 hours ago