Subrata Roy: “తనని కోల్పోవడం మా అందరి దురదృష్టం, సహస్రిజీ మా అందరికి ఆదర్శం, ఆయన తో కలిసి పని చేసే అవకాశం దొరకడం మా అందరి అదృష్ట” – సుబ్రతా రాయ్ మరణం పై సహారా గ్రూప్ ప్రకటన

సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ ఎన్నో రోజులుగా అనారోగ్యం తో ముంబై లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు, అయితే నవంబర్ 14న ఆరోగ్యం ఇంకా క్షీణించడం తో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబాని హాస్పిటల్ లో అడ్మిట్ చేయగా అక్కడే మరణించినట్లు తెలిసింది. నవంబర్ 14 2023 రాత్రి 10.30 నిమిషాలకు సుబ్రతా రాయ్ కార్డియాక్ అరెస్ట్ అయి మరణించారు, ఎప్పటినుంచి తాను మెటాస్టాటిక్ మలిగ్నన్సీ, హైపర్ టెన్షన్, డయాబెటిస్ సంబంధిత వ్యాధులతో పోరాడుతూ చివరికి 75 సంవత్సరాల వయసులో కన్ను మూసారు. 1948లో జన్మించిన సుబ్రతా రాయ్ గోరఖ్పూర్ లోని గవర్నమెంట్ కాలేజీ నుండి మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు, ఆ తరువాత ఫైనాన్స్ రియల్ ఎస్టేట్, మీడియా, హోటల్స్, ఇలాంటి ఎన్నో వ్యాపారాలలో రాణించి దేశం లోనే అతి పెద్ద సంస్థలలో ఒకటైన సహారా గ్రూప్ ని స్థాపించారు. సుబ్రతా రాయ్ వారసులుగా అతని భార్య కొడుకు ఉన్నారు.