NewsOrbit
Horoscope దైవం

November 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? నవంబర్ 15 కార్తీక మాసం రోజు వారి రాశి ఫలాలు!

daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
Share

November 15: Daily Horoscope in Telugu నవంబర్ 15– కార్తీక మాసం – బుధవారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Daily Horoscope to start your day, August 7 2023 Daily Horoscope, August 7 Rasi Phalalu
Daily Horoscope to start your day NOVEMBER 15 th 2023 Daily Horoscope November 15th Rasi Phalalu

వృషభం
సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.
మిధునం
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వాహనయోగం ఉన్నది. పనులలో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
daily horoscope November 15th 2023 rasi phalalu kartika masam

కర్కాటకం
ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.
సింహం
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయటా సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలు అంతంతమాత్రంగా ఉంటాయి.

కన్య
చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.
తుల
చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి.

వృశ్చికం
గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి అధికారుల అనుగ్రహం పొందుతారు.
ధనస్సు
కీలక వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

మకరం
అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి.
కుంభం
నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మీనం
ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన రుణయత్నాలు సాగిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..


Share

Related posts

Today Horoscope సెప్టెంబర్ 9th బుధవారం మీ రాశి ఫలాలు

Sree matha

Srikalahasti : శ్రీకాళహస్తి లో దర్శనం  తరువాత ఇక ఏ  దేవాలయానికి వెళ్లకూడదని చెప్పడం వెనుక ఉన్న కారణం ఇదే!!

siddhu

Today Horoscope: మే 9 – వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma