Krishna Mukunda Murari:నిన్నటి ఎపిసోడ్ లో, మురారి, కృష్ణ ముకుందా ముగ్గురు కలిసి షాపింగ్ చేస్తూ ఉంటారు. కృష్ణ మురారి కి దగ్గరగా ఉండడం చూసి ముకుందా చాలా ఫీల్ అవుతుంది అసలు కృష్ణుని షాపింగ్ మాల్ కి పంపించిన విషయాన్ని భవానీ దేవికి చెప్తుంది. భవానీ దేవి కృష్ణుని షాపింగ్ మాల్ కి ఎవరు పంపించారు అని రేవతి నీ మధుని అడుగుతుంది ఇద్దరూ తెలియదని చెప్తారు. నందు సపోర్ట్ తీసుకొని రేవతి కృష్ణ మురారిని కలపాలి అనుకుంటుంది. షాపింగ్ మాల్ లో కృష్ణ కోసం మురారి రింగు తీసుకుంటాడు అది ఎవరికీ తెలియకుండా నైట్ టైం కృష్ణ ఇంటికి ఒంటరిగా వచ్చి కృష్ణకి ఆ రింగు తొడుగుతాడు ఇదంతా ముకుంద చూస్తుంది.

ఈరోజు315 వ ఎపిసోడ్ లో, మురారి కృష్ణ ని బయటికి తీసుకువెళ్లి రింగ్ తొడిగి ఈ రింగ్ ఎలా ఉంది అని అడుగుతాడు. చాలా బాగుంది సార్ అని చెప్తుంది. ముకుంద వాళ్ళిద్దరినీ చూసి మీ సంగతి రేపు పూజలో చెప్తాను అని అనుకుంటుంది. కృష్ణ లోపలికి రాగానే ఏంటి బిడ్డ సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది వాళ్ళ పిన్ని. రింగ్ తోడిగారు ఐ రింగు మురారి సరే ఇచ్చారు అని చెప్తుంది దానికి దేవుడు మంచి వాళ్ళకి మంచే చేస్తాడు అని చెప్తుంది.
Nuvvu Nenu Prema: విక్కీ ఆరోగ్యం గురించి అరవింద కంగారు.. విక్కీ ప్రేమ కోసం పద్మావతి చేసిన ప్రయత్నం.

భవానీతో కృష్ణ మీద కంప్లైంట్..
భవానీ దేవితో ముకుంద అత్తయ్య కృష్ణ చాలా న్యూసెస్ చేసింది అని అంటుంది. షాప్ లోనా అని అంటుంది భవాని దేవి. అవును అత్తయ్య చాలా న్యూస్ చేసింది అసలు మనకు ఇంకా మురారి సార్ దక్కడు అని అంటుంది ముకుంద. దేని గురించి ముకుందా ఇంత భయపడుతున్నావ్ అని అంటుంది. అక్కడ మురారి ని ఏసీబీ సార్ అని పిలిచిందా అని అంటుంది భవానీ దేవి, డిపార్ట్మెంట్ వాళ్ళకి పరిచయం చేసిందా ఏంటి అని అంటుంది. తను మురారి కి గుర్తొచ్చేలాగా అన్ని విషయాలు వెనక్కి వెళ్లి చెప్తోంది. అని షాప్ లో జరిగిన విషయాలన్నీ భవానీ దేవికి వివరిస్తుంది ముకుంద. ఇది టెన్షన్ పడాల్సిన విషయం ఆ కాదా అత్తయ్య అని అంటుంది భవాని దేవి తో, నువ్వు టెన్షన్ పడకు అని నేను చూసుకుంటాను అంటుంది భవాని దేవి ముకుందతో, సరే అత్తయ్య అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ముకుంద.
Krishna Mukunda Murari: క్రిష్ణ కోసం మురారి పోరాటం.. భవాని మాస్టర్ ప్లాన్..

పూజకి ఏర్పాట్లు..
రేవతి పూజకు ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఏంటి పిల్లలు ఇంకా రాలేదా అంటుంది భవానీ దేవి. అప్పుడే అక్కడికి వచ్చి నందుతో నీకు ఈ చీర చాలా బాగుంది. గౌతమ్ కూడా ఇదే చెప్పాడు అని అంటుంది నందు భవానీ దేవి నవ్వుతుంది రేవతి అంతేలే అమ్మ కన్నా ఇప్పుడు నీ భర్త ఎక్కువ అయ్యాడా అని అంటుంది అదేం లేదు పిన్ని అని అంటుంది. మధు పూజారి గారిని తీసుకువస్తాడు మురారి గతం మర్చిపోయాడు మీరు పూజ చేసేటప్పుడు ఎలాగైనా తనకి గతం గుర్తుకొచ్చేలా చేయాలి అని అంటాడు మధు పూజారితో, సరే అని అంటాడు పూజారి ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తాడు. మురారి రెడీ అవుతుంటే ముకుందా అక్కడికి వెళుతుంది. నీ డ్రెస్ చాలా బాగుంది మురారి అని చెప్తుంది ముకుంద. అప్పుడే అక్కడికి వెళ్ళిన గౌతం మురారిని కిందకి వెళ్దాం పద అని అంటాడు ముగ్గురు కలిసి కిందకు వస్తారు. వాళ్ళు ఎలా వస్తూ ఉంటే భవాని దేవి చూసి నేను తీసుకునే నిర్ణయం కరెక్టే వీళ్ళిద్దరూ చూడడానికి చాలా బాగున్నారు అని ఉంటుంది. వెంటనే నందుని వాళ్ళిద్దరిని ఫోటో తీయి అని చెప్తుంది నందు వెళ్లి మురారి కి ముకుందని కలిపి వస్తూ ఉండగా ఆపి ఫోటో తీస్తుంది. కిందకి రాగానే మురారి ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్తాడు. మురారి అని పిలుస్తూ ఉంటుంది భవానీ దేవి అయినా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. భవానీ దేవి ఎవరు కృష్ణ ని పిలవడానికి వీల్లేదు, అని ఇంట్లో అందరికీ చెప్తుంది.

పూజకి రెడీ..
కృష్ణ పూజకి రెడీ అవ్వడానికి చీర కోసం వెతుకుతూ ఉంటుంది. చీర కనిపించదు. ఇప్పుడు మురారి ఇచ్చిన చీర ఇంకా కనిపించినట్లేనా అని అంటుంది. వాళ్ల పిన్నితో చీర గురించి మాట్లాడుతూ ఉంటుంది అంతలో ఈ చీర కూడా మురారి సారి ఇచ్చిందే కదా ఇది కట్టుకో అమ్మి అని అంటుంది వాళ్ళ పిన్ని. అయినా మురారి నీ వాడైతే ఆ చీర కనిపిస్తుందిలే అని అంటుంది ఇలాంటివన్నీ చెప్పొద్దు అని అంటుంది కృష్ణ. సరే ముందు ఈ చీర కట్టుకో ఇది కూడా మురారి ఇచ్చింది అని ఇస్తుంది సరే అంటుంది కృష్ణ మీరు రావట్లేదా పూజకి అని అంటుంది. నేను రానులే అని అంటుంది వాళ్ళ పిన్ని సరే అని కృష్ణ రెడీ అవుతుంది. మురారి వేణి కోసం గుమ్మం దగ్గరే నుంచోనే ఉంటాడు అది చూసి ముకుందా భవాని దేవి జరుగుకుంటారు. ఏంటి రేవతి ఫేస్ అలా పెట్టావు అని అంటుంది భవాని దేవి. రాజకీయ నాయకుడు కొత్తగా పాలసీ తెస్తే అది స్టూడెంట్స్ కి నచ్చకపోతే వాళ్ళు ఎలా ఉంటారు నువ్వు అలా ఉన్నావు రేవతి అని అంటుంది భవాని దేవి. అలా ఏం లేదు అక్క అని అంటుంది రేవతి. ఇంతలో మధు నువ్వు ఫేస్ అలా పెట్టుకో పెద్దమ్మ ఎందుకంటే కృష్ణ ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది అది కూడా మురారి కట్టుకొని వస్తుంది అని అంటాడు ఆ మాటకు రేవతి నవ్వుతుంది. ముకుందా భవాని దేవితో చూడండి అత్తయ్య మురారి వాకిలి దగ్గరే ఎదురు చూస్తూ ఉన్నాడు అని అంటుంది. ఆ కృష్ణ వస్తుందని ఆ కృష్ణ కోసమే చూస్తున్నాడు అని అంటుంది. ఏమో ముకుందా ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా అనీజీగా ఉంది అని అంటుంది భవానీ దేవి. అక్కడిదాకా వచ్చినవాళ్లు లోపలికి వస్తారులే మురారి నువ్వు వచ్చేసేయ్ అని అంటుంది భవాని దేవి సరే అని మురారి లోపలికి వస్తాడు. పూజకి కూర్చోండి అని అంటాడు పంతులుగారు అప్పుడే కృష్ణ ఎంట్రీ ఇస్తుంది. కృష్ణుని చూసి అందరూ షాక్ అవుతారు భవానీ దేవి, కృష్ణ వైపు కోపంగా చూస్తుంది. కృష్ణ గుమ్మం దగ్గర ఉంటుంది అది చూసి మురారి నేను ఇచ్చిన చీర, కట్టుకుంటే మళ్లీ ముకుంద ఏమన్నా అనుకుంటుందని కట్టుకు రాలేదట్టుంది ఆ భాదే కనిపిస్తుంది కృష్ణ కళ్ళల్లో అని మురారి అనుకుంటాడు. రేవతిని అమ్మ వెళ్లి వేణి గారిని లోపలికి తీసుకురా అని అంటాడు. సరే అని రేవతి గుమ్మం దగ్గరకి వెళ్తుంది అప్పుడు మురారి భవానీ దేవితో పెద్దమ్మ నేను ఇచ్చిన చీరలు రెవెన్యూ గారి కట్టుకొని రాలేదు కారణం మీ మీద భయంతోనే, అందుకే మీరు తనని ఏమీ అనకండి పూజలో కూర్చొని ఇవ్వండి అని అంటాడు మురారి. చేసేదేం లేక భవాని దేవి సరే నాన్న అని అంటుంది. ఇక పూజలో ముకుందా మురారి కృష్ణ ముగ్గురు కూర్చుంటారు మురారి కి ఒక వైపు కృష్ణా ఒకవైపు ముకుందా కూర్చుంటారు. పంతులుగారి ముందు బొట్టు పెట్టుకోండి అని అంటాడు. అందరూ బొట్టు పెట్టుకుంటారు.

బాంబు పేల్చబోతున్న ముకుంద..
పంతులు గారి పూజ చేయిస్తూ ఉంటారు రేవతి కృష్ణ మురారి లను చూసి చాలా సంతోషిస్తుంది. మురారి కూడా తన పక్కన కృష్ణ కూర్చున్న అందుకు చాలా సంతోషిస్తాడు. తన ఇచ్చిన రింగ్నే చూసుకుంటూ ఉంటుంది అది చూసి మురారి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ముకుందా తన ప్లాన్ మొదలు పెడుతుంది. కావాలని రింగు కోసం వెతుకుతూ ఉంటుంది నేను నిన్ను రింగు కొనుక్కున్నాను అత్తయ్య అది వెతుకుతున్నాను ఎక్కడో పడిపోయింది అని అంటుంది భవాని దేవితో, ఇప్పుడు వేణి గారి ఉన్న రింగు చూస్తే నా రింగు గుర్తుకు వచ్చింది. గేమ్ స్టార్ట్ చేసింది అని అంటాడు మధు మనసులో, ఇప్పుడు ఈ రింగ్ మీద పంచాయతీ పెడుతుందేమో ఏసీబీ సారు ఇచ్చాడు అని చెప్తే అందరూ ఆయన తిడతారేమో అని మనసులో అనుకుంటుంది కృష్ణ. అంత జాగ్రత్త అయితే ఎలాగా అని అంటుంది భవానీ దేవి. అత్తయ్య ఇప్పుడు చెప్పొచ్చు చెప్పకూడదు కానీ వేణి గారి చేతికి ఉన్న రింగు నాదే అత్తయ్య అని ముకుందా అంటుంది. వెంటనే మురారి ఏం మాట్లాడుతున్నావ్ ముకుందా అని అంటాడు. కావాలనే కృష్ణని ఇరికిస్తుంది అని,అనుకుంటాడు మురారి. వెంటనే భవానీ దేవి ఆ రెండు నీది కాదా అని కృష్ణ అని అడుగుతుంది. మురారి చెప్పబోతూ ఉండగా, కృష్ణ వెంటనే ఆపి మీరేం మాట్లాడద్దు సార్ అని అంటుంది. వెంటనే భవానీ దేవి ఆ రింగు నీదా కాదా అని అడుగుతుంది కృష్ణుని వెంటనే కృష్ణ నాది కాదు అని చెప్తుంది. నువ్వు డాక్టర్ చదివి వేరే వాళ్ళ రింగ్ ఎలా దొంగతనం చేసావు అని అంటుంది భవాని దేవి. కృష్ణ నేను దొంగతనం చేయలేదు బయట కనిపిస్తే, పెట్టుకున్నాను అని అంటుంది. అయితే నా రింగ్ నాకు ఇచ్చేసేయ్ అని అంటుంది ముకుంద. కృష్ణ మురారి ఇద్దరూ చాలా ఫీల్ అవుతారు కృష్ణ తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ రింగ్, రాదు, మురారి నేను తీస్తాను ఇటు ఇవ్వండి అని చెయ్యి పట్టుకోబోతు ఉండగా భవాని దేవి హ్యాపీ వద్దు నాన్న అని పెద్దగా అరిచి దానము చేశాను అనుకుందాం వదిలేసేయ్ అని అంటుంది. వెంటనే కృష్ణ చాలా బాధపడుతుంది. ఎక్కడ మురారి తన చేతిని పట్టుకుంటే గతం గుర్తుకు వస్తుందో అని భవానీ దేవి భయపడుతుంది.
రేపటి ఎపిసోడ్ లో, అందరూ దీపావళి చేసుకుంటూ ఉంటారు. కృష్ణ మురారి ఇచ్చిన చీర కట్టుకొని వస్తుంది. అది చూసి సంతోషిస్తాడు మురారి. కృష్ణ మురారి కలిసి క్రాకర్స్ వెలిగిస్తూ ఉంటారు అది చూసి భవానీ దేవి కోపంగా ఉంటుంది. అనుకోకుండా కృష్ణచీర కి నిప్పు అంటుకుంటుంది. మురారి వెంటనే కృష్ణ అని గట్టిగా అరిచి నిప్పు ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.