Naga Panchami november 14 2023 episode 200 : థాంక్యూ సుబ్బు నా ప్రాణం ఎక్కడ ఉందో నాకు తెలిసేలా చేశావు చిన్నపిల్లవాడివైన నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది అని మోక్ష తన మనసులో అనుకుంటాడు. పంచమి ఆనందంతో తన వంక చూస్తుంది. నా మనసును కమ్ముకున్న కారుమబ్బులు విడిపోయాయి పంచమి నిన్ను నేను ఎప్పటికీ వదులుకోలేను చావు భయం పోయింది ఇక ఒక్క రోజైనా నీతో గడిపితే చాలు ప్రేమికులకు అందుకే ధైర్యం ఎక్కువ అనుకుంటా క్షణం ఒక యుగం లాగా అనుకుంటారు అలా ఆలోచిస్తే మనం ఎంతో అదృష్టవంతులం పంచమి ఇక నేను ఏ చావుకి భయపడను నా మనసులో నీ రూపాన్ని ముద్రించుకొని ఆనందంగా బ్రతికేస్తాను అని మోక్ష అంటాడు.

కట్ చేస్తే, ఓడిపోవడం కన్నా తల ఖండించుకొని చనిపోవడం మంచిది అని నీలాంబరి వాళ్ళ దూతలని పిలిచి పంచమిని అందరూ అవమానించి తిట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలా చేయాలి మీరు వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ పనిలో ఉండండి అని అంటుంది. అలాగే అని వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు. కట్ చేస్తే, పంచమి పూజ చేస్తూ నా భర్త ప్రాణాలు నేను ఎలాగైనా కాపాడుకునే శక్తిని ప్రసాదించు భగవంతుడా అని కోరుకుంటుంది. ఇంతలో మోక్ష వచ్చి ఏం కోరుకున్నావు పంచమి అని అడుగుతాడు. నా తాళిని బాగుండేలా చూడుమని ముక్కుకున్నాను అని పంచమి అంటుంది. నీకోసం నన్నేం కోరుకోమంటావో చెప్పు అని మోక్ష అడుగుతాడు. నేను సుమంగళిగా పోవాలని మొక్కుకోండి అని పంచమి అంటుంది. నా ప్రాణం ఉన్నంతవరకు నేను ఎక్కడికి వెళ్ళనివ్వను పంచమి అని మోక్ష పంచమి నుదుటి మీద ముద్దు పెడతాడు. ఇంతలో వైదేహి పంచమి పంచమి అని గట్టిగా పిలుస్తుంది. ఈ గర్వమే వద్దనేది కాస్త ప్రేమగా పిలువు వైదేహి .

ఏంటమ్మా పంచమిని పిలిచావు అని మోక్ష అంటాడు. మోక్ష పంచమితో ఏం మాట్లాడుతున్నాడో నువ్వు ఆగు అని రఘు అంటాడు. ఏముంది పంచమిని మూట ముళ్ల సర్దుకొని వెళ్ళిపొమ్మని చెప్తుంది అత్తయ్య అని చిత్ర అంటుంది. నాన్న ఈమధ్య వీళ్ళకి తల పొగరు ఎక్కువ అయ్యి ఇలా మాట్లాడుతున్నారు అని చిత్ర వాళ్ల ఆయన అంటాడు. అమ్మ పంచమి నా మోక్ష ప్రాణాలు నువ్వే కాపాడాలి అని వైదేహి అంటుంది. ఏంటి అత్తయ్య ఆటో బాంబు పేలుస్తుందంటే సీమటపాకాయ్ పేల్చింది అని చిత్ర అంటుంది. దీపావళిలో పేల్చే సీమటపాకాయల సోది చెప్పకండి అత్తయ్య మంచి ఆటో బాంబు లాంటి మాట చెప్పండి అని జ్వాలా అంటుంది. మా జ్వాలా ఫస్ట్ కాకర పుల్లలు సీమ టపాకాయలు పేల్చిన ఆఖరిలోనే కదా ఆటో బాంబు పేల్చేది అప్పటిదాకా ఆగండి అని రఘు అంటాడు. అమ్మ వైదేహి వాళ్లు అలాగే మాట్లాడతారు కానీ నువ్వు చెప్పాల్సిందేంటో పూర్తి చెయ్యి అని శబరి అంటుంది. వైదేహి పంచమి దగ్గరికి వెళ్లి చూడు పంచమి ఇంటి పెత్తనం ఈరోజు నుంచి నీదే నువ్వే చూసుకోవాలి అని వైదేహి అంటుంది.

ఇది తొండి నేను ఒప్పుకోను మేము ఇక్కడే ఉండగా దానికి ఎలా ఇస్తారు అని చిత్ర అంటుంది.అత్తయ్య ఇది అన్యాయం ఇంటికి పెద్దదాన్ని నేను ఉండగా నిన్న మొన్న వచ్చిన దానికి పెత్తనం ఎలా ఇస్తారు మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు అని జ్వాలా అంటుంది.ఏమమ్మా కోడళ్ళు మీ అత్తయ్య పేల్చిన ఆటో బాంబు ఎలా ఉంది అని రఘు అంటాడు. అత్తయ్య నేను చదువుకోలేదు నాకు లెక్కలు సరిగా రావు ఇంట్లో ఇంతమంది పెద్దవాళ్ళు ఉండగా నాకెందుకు అత్తయ్య ఈ పెత్తనం, ఈ పెత్తనం నాకు అక్కర్లేదు కానీ మీరు ఏ పనైనా చెప్పండి చేసి పెడతాను అని పంచని అంటుంది. ఇంటి పెత్తనం తీసుకోవాలి అంటే నోరు ఒకటి ఉంటే సరిపోదు పంచమి మంచి మనసు అందరినీ ప్రేమించే గుణం ఉండాలి అని రెండు నీలో ఉన్నాయి పంచమి అని వాళ్ళ బావ అంటాడు. పిన్ని భయపడకు ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేసి పెడతాను తీసుకో పిన్ని అని సిసిరా అంటుంది. చూడు పంచమి ఇంతమంది చెబుతూ ఉంటే కాదనకూడదు తీసుకో అని మోక్ష అంటాడు. చూడమ్మా పంచమి నీ మంచితనం నీ అమాయకత్వం చూసి మీ అత్తయ్య అలా మాట్లాడింది కానీ నిజానికి అదే మంచి ఆలోచన ఎందుకు అంటే అందరి గురించి ఆలోచించే నువ్వు తప్ప ఈ ఇంటికి పెత్తనం ఎవరు చేసినా ఇల్లు అంతా గందరగోళం అయిపోతుంది అని వాళ్ళ పిన్ని అంటుంది.

చూడు పంచమి వైదేహి చెప్పినట్టు నువ్వే ఇంటి పెత్తనం చేస్తే అందరికీ మంచిది ఇంటి పెత్తనం చేయాలంటే లెక్కలు అన్ని రానక్కర్లేదు పంచమి అందర్నీ అర్థం చేసుకునే గుణం ఉంటే సరిపోతుంది అని శబరి అంటుంది. ఏంటి అందరూ తనని తెగ పొగిడేస్తున్నారు ఏదో ఒక రోజు ముంచుతుంది చూడండి అని జ్వాల అంటుంది. మీరు ఎన్ని చెప్పినా ఎంత వెనకేసుకొచ్చిన నేను మాత్రం ఒప్పుకునేది లేదు అని చిత్ర అంటుంది. చూడు పంచమి అందరూ మెచ్చుకున్నారని నిన్ను పొగుడుతున్నారని నువ్వు దేనికైనా సమర్ధురాలువాని నీకు ఈ తాళాలు ఇవ్వడం లేదు పంచమి అని వైదేహి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.