Krishna Mukunda Murari: రేవతి వాళ్లు మన మురారిని కూడా చంపడానికి వెనకాడ లేదు. అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలిసి కృష్ణ ఇంట్లో నుంచి గెంటేసినందుకు వాళ్ళు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. ఫేస్ మార్చేసి వాళ్లతో పాటు తీసుకువెళ్లడానికి ట్రై చేశారు అని భవాని అంటుంది. నాకెందుకో వాళ్లే ఇలా చేశారు అంటే నమ్మబుద్ధి కావడం లేదు అక్క. ఎవరో బయట వాళ్లే ఇదంతా చేశారు అని రేవతి అంటుంది. అదేంటంటే మీరు ఇంతలా చెబుతున్నా రేవతి అత్తయ్య నమ్మకపోవడం మీకు ఎలా ఉందో కానీ, నాకు మాత్రం బాధగా ఉంది అని ముకుంద ఇంకాస్త ఆజ్యం పోసింది. ఇప్పుడు చెప్పే మాట మిమ్మల్ని బాధ పెట్టిన పర్వాలేదు రేవతి. ఇక మురారి కి గతం గుర్తు రాకుండా ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది అని భవాని అంటుంది. గతం గుర్తొస్తే ఆ కృష్ణ మన మురారి నీ మనకి దక్కనివ్వదు అంటుండగా.. కృష్ణ మురారి అక్కడికి వస్తారు. కృష్ణవేణి నీ నేనే కాఫీ తాగడం కోసం తీసుకోచ్చాను అని మురారి అంటాడు. కృష్ణ నీ ఇన్ డైరెక్ట్ గా వెళ్ళిపోమని భవాని మా మురారిని నేను చూసుకుంటా నువ్వు వెళ్ళమని చెబుతుంది.

కృష్ణని వెతుక్కుంటూ శకుంతల అక్కడికి వస్తుంది. భవాని శకుంతలనే అక్కడ చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేలోపే మురారి పైనుంచి దిగుతూ ఉంటాడు. ఇక వెంటనే రేవతికి సైగ చేసి తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని తను ఎక్కడ అల్లుడు అని పిలిస్తే మళ్లీ మురారి కంగారుపడుతాడు. త్వరగా ఎక్కడినుంచి తీసుకొని వెళ్ళిపోమని చెబుతుంది. ఇక కృష్ణ ఉండే అవుట్ హౌస్ దగ్గరికి రేవతి శకుంతలని తీసుకువస్తుంది.

శకుంతలని ఇంట్లోకి వచ్చిన కూడా ఎందుకు మర్యాద ఇవ్వడం లేదని పెద్దమ్మ కళ్ళ ల్లో కృష్ణ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కోపం ఎందుకు ఉందా అని మురారి ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది మురారి ఏం ఆలోచిస్తున్నావు అని ముకుంద అడుగుతుంది. వేణి గురించి ఆలోచిస్తున్నావా అని ముకుందా అనగానే అవును నాకు పదేపదే వేణి నే గుర్తుకు వస్తున్నారు. తన గురించి ఆలోచిస్తున్నాను అని మురారి సూటిగా స్పష్టంగా కరాకండిగా భవాని ముందే చెప్పేస్తాడు. నువ్వే కాదు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చెప్పేది అదే నేను వేణి గారితో మాట్లాడకూడదు. నాకు ఆ విషయం అర్థమైంది కానీ నన్నేం చేయమంటావు. నాకు పదేపదే తనే గుర్తుకొస్తుంది అని మురారి తన వేదనని వ్యక్తపరుస్తాడు.

ప్లీజ్ ఇంకేం మాట్లాడద్దు నా బాధలేవో నేను పడతాను అని మురారి అక్కడ నుంచి వెళ్ళిపోబోతుండగా నాన్న మురారి అని భవాని పిలుస్తుంది. నీ వేదన ఏంటో నాకు అర్థమైంది అందుకే కదా నాన్న నిన్ను అమెరికా పంపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటివి జరుగుతాయని డాక్టర్స్ చెప్పారు. అయినా సరే మనకి ద్రోహం చేసిన కూడా ఆ కృష్ణవేణిని , ఆ డాక్టర్ ఫ్యామిలీ ని కూడా భరిస్తున్నాము నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక. ఎంత డాక్టర్ అయినా పరాయి అమ్మాయితో ఎంతో చనువుగా ఉండడం కరెక్ట్ కాదని తెలిసిన ఎందుకు ఊరుకుంటున్నాను, ఎవరికోసం ఊరుకుంటున్నాను నీకోసమే కదా అని భవాని మురారిని కూల్ చేయడానికి చెబుతుంది. బాధపడకండి ప్లీజ్.. మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను అని అక్కడి నుంచి మురారి వెళ్ళిపోతాడు.

నా బిడ్డకు ఎంత అన్యాయం చేస్తారని నేను అనుకోలేదు. మీరు నా బిడ్డకు అన్యాయం చేస్తున్నారు అంటూ శకుంతల బాధపడుతూ ఉంటుంది. ఇక కృష్ణ శకుంతలకు సర్ది చెబుతుంది. వీళ్ళందరూ నన్ను బానే చూసుకుంటున్నారు కానీ, చిన్నాన్న నేరం ఒప్పుకున్నారు కదా, ఆ విషయం భవాని అత్తయ్యకు తెలియదు కాబట్టి నిజంగానే చిన్నాన్న తప్పు చేశాడని అనుకుంటుంది. పెద్దత్తయ్యకు నిజం తెలిసే వరకు నువ్వు మీ అల్లుడు గారిని అల్లుడు అని పిలవద్దు అని నచ్చ చెబుతోంది. అందుకు శకుంతల ఒప్పుకుంటుంది.

మురారి కృష్ణ దగ్గరకు వెళ్తాడు. మీ బంధువు వచ్చారు కదా అని అంటాడు. తను మీకు ఎలా తెలుసు అని కృష్ణ అంటుంది. మీతో పాటు హాస్పిటల్లో చూశాను కదా అని మురారి అంటాడు. తనకి కూడా మా ఇంట్లో రెస్పెక్ట్ దొరకడం లేదని మురారి బాధపడతాడు. అయినా మీరు మా ఇంట్లోనే ఉంటున్నాను అని మీ వాళ్లకు చెప్పారా అని మురారి కృష్ణవేణిని అడుగుతాడు. ఇక కృష్ణ మౌనంగా ఉండిపోతుంది.

మరోవైపు మురారి ఎక్కడ అని భవాని ఇల్లంతా చూస్తూ ఉంటుంది. ఎక్కడా కనిపించకపోయేసరికి రేయ్ మధు మురారి ఎక్కడ అని అడుగుతుంది. ఇక ముకుందని కూడా అడుగుతుంది. ఎవరు వాళ్లకి తెలియదు అని అనడంతో ఇల్లంతా వెతకమని వాళ్ళిద్దర్నీ పంపిస్తుంది. ఇంట్లో ఎక్కడా లేడు అని వాళ్ళు చెబుతారు. అప్పుడే మురారి కృష్ణ ని కలిసి లోపలికి వస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్లావు మురారి అని ముకుందా అడుగుతుంది. మురారి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోబోతుంటే భవాని వేణి దగ్గరికి వెళ్లి వచ్చావా అని అడుగుతుంది. అప్పుడు మురారి నేను గతంతో పాటు అబద్ధం చెప్పడం కూడా మర్చిపోయాను. అందుకే మీతో నిజం చెప్పలేక ఇక్కడ నుంచి వెళ్ళి పోతున్నాను అని మురారి అంటాడు. మురారి నువ్వు ముకుందా మధు అందరూ దీపావళికి షాపింగ్ చేయడానికి బయటికి వెళ్ళండి అని భవాని అంటుంది. రేవతి ఈసారి నువ్వు కూడా అడిగితే పాటు కలిసి షాపింగ్ కి వెళ్ళమని భవాని చెబుతోంది. ఏం ముకుందా షాపింగ్ కి వెళ్ళాలా అని మురారి అడుగుతాడు. మురారి పండక్కి షాపింగ్ చెయ్యి అలాగే ఈ పండక్కి నందు గౌతమ్ ఇద్దరు వస్తారు అని అనగానే మురారి ముఖంలో ప్రశ్నార్థకం కనిపిస్తుంది అదే మీ చెల్లెలు నందిని తన భర్త గౌతం అని భవాని అంటుంది. ఓకే వాళ్లు కూడా తెలియదు అంటే బాగోదు అని అవునా వస్తున్నారా వాళ్లని ఒక వారం రోజులు ఉండమని చెప్పండి అని మురారి కవర్ చేసుకుంటాడు. ఇక మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.