NTR: ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రెండేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఇప్పటికే మూడుసార్లు పోస్ట్ పోన్ అయిన ఈ పాన్ ఇండియన్ సినిమా ఎట్టకేలకు జనవరి 7న వస్తుందని రాజమౌళి బృందం ప్రకటించింది. నవంబర్ నుంచి భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించారు. రాజమౌళి, హీరోలు చరణ్ – తారక్ ముంబై, చెన్నై, బెంగళూరులలో భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించారు.
ఈ ఊపు చూసి ఆర్ఆర్ఆర్ 14 భాషల్లో ఈ సారి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుందని అందరూ ఫిక్సైయ్యారు. యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైంది. కట్ చేస్తే కరోనా వైరస్ థర్డ్ వేవ్ దెబ్బకి ఊహించని విధంగా వాయిదా వేశారు. సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా కొత్త రికార్డుల గురించి మాట్లాడుకోవాల్సిన ప్రేక్షకులు పోస్ట్ పోన్ గురించి మాట్లాడుకున్నారు. ముఖ్యంగా తారక్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అందుకే నెక్స్ట్ సినిమా గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
NTR: దానికి రివర్స్‌లో ఎన్టీఆర్ 30 షూటింగ్ ..!
సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్టీఆర్ 30 చిత్రానికి సంబంధించిన అప్డేట్ వస్తుందని అందరూ భావించారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఓపెనింగ్ సంక్రాంతి రోజు జరుగుతుందని త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, దానికి రివర్స్‌లో ఎన్టీఆర్ 30 షూటింగ్ ఇప్పట్లో ఉండే అవకాశాలు లేవని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను మొదలపెట్టే ఆలోచనలో మేకర్స్ లేరట. ఎంత కాదన్నా మరో రెండు నుంచి మూడు నెలలు పడుతుందని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇంతకంటే బ్యాడ్బ్యూస్ మరోటి ఉండదు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!