Acharya: మెగా మల్టీస్టారర్‌గా రూపొంద్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా, కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా..సంగీత, రెజీనా కసాండ్ర స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనున్న సంగతి తెలిసిందే.
వాస్తవంగా ఈ సినిమాను గతేడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాల్సింది. అయితే కరోనా పాండమిక్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఆచార్య నుంచి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్, టీజర్స్ పోస్టర్స్ భారీ అంచనాలను నెలకొల్పాయి. అయితే ఇన్నాళ్ళు మెగా ఫ్యాన్స్‌కు ఓ డిసప్పాయింట్మెంట్ ఉండేది. అన్నీ సినిమాలు పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఆ స్థాయిలో సౌత్ సహా హిందీ భాషలలోనూ రిలీజ్ చేస్తున్నారు.
Acharya: ఆచార్య సినిమాను మల్టీ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేసేందుకు చరణ్ ప్లాన్..!
అదే మెగా అభిమానులకు ఆచార్య సినిమా విషయంలో లోటుగా ఉండేది. కానీ, మెగా ఫ్యాన్స్‌కు ఇప్పుడు చిరు – చరణ్ భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఆచార్య సినిమాను మల్టీ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేసేందుకు చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. అంటే పాన్ ఇండియన్ రేంజ్లో మెగా అభిమానులు ఆశించిన విధంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మిగతా భాషలలో డబ్బింగ్ వర్షన్స్ తీసుకురానున్నట్టు లేటెస్ట్ న్యూస్. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలో రానున్నట్టు సమాచారం. ఇదే గనక నిజమైతే ఆచార్య కూడా పాన్ ఇండియన్ సినిమాగా రికార్డ్స్ కొల్లగొట్టడం ఖాయం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!