న్యూస్ సినిమా

Acharya: సెన్సార్ పూర్తి చేసుకున్న మెగా మల్టీస్టారర్..

Share

Acharya: ఆచార్య…మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలు గా నటించిన మెగా మల్టీస్టారర్ సినిమా. ఈ సినిమా ఏప్రిల్ 29న భారీ స్థాయిలో విడుదల కు సిద్ధమవుతోంది. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందివ్వడం విశేషం. తాజాగా ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.

acharya mega multistarer completed sensor
acharya mega multistarer completed sensor

ఈ సందర్భంగా చిరు..”మా ‘ఆచార్య’ సినిమాలో ‘పాద ఘట్టాన్ని’ సూపర్ స్టార్ మహేష్ తన గొంతుతో మొదలు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే, ఆచార్య సినిమా కు మహేష్ తన వంతుగా ప్రత్యేక పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నని ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, మెగా అభిమానులు, ప్రేక్షకులు కూడా నేను – రామ్ చరణ్ ఎంతగా థ్రిల్ అయ్యామో.. వారు కూడా థ్రిల్ ఫీలవుతారని చిరంజీవి.. మహేష్ ఇచ్చిన వాయిస్ ఓవర్‌ మీద ఈ పోస్ట్‌లో తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Acharya: బ్యాక్ టు బ్యాక్ ఆచార్య సినిమా అప్‌డేట్స్.. అభిమానుల ఆనందానికి అవధులు లేవు..

ఇదే క్రమంలో ఆచార్య చిత్ర దర్శకుడు కొరటాల శివ కూడా మహేశ్ బాబు అడగగానే వాయిస్ చెప్పేందుకు ఒప్పుకున్నారని..దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అయితే, తాజాగా ఈ మెగా మల్టీస్టారర్ చిత్రానికి సెన్సార్ పూర్తై యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయాన్ని కూడా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ ఇచ్చారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆచార్య సినిమా అప్‌డేట్స్ వస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


Share

Related posts

Olympics: మూడేళ్ళు పక్షవాతంతో మంచం పట్టింది… కానీ శిష్యురాలిని ఒలింపిక్ విన్నర్ గా నిలిపింది

arun kanna

కంగ‌నాపై ఆయ‌న చెప్పు విసిరాడు

Siva Prasad

Lock down: లాక్ డౌన్ కేసీఆర్ పంట పండించిన మూడు అంశాలు ఏంటంటే…

sridhar