సినిమా

Adivi Sesh: `చంద‌మామ‌`లో అస‌లు హీరో నేనే.. సీక్రెట్ రివిల్ చేసిన అడివి శేష్‌!

Share

Adivi Sesh: కొన్ని కొన్ని చిత్రాల‌ను ప్రేక్ష‌కులు అంత తొంద‌ర‌గా మ‌ర‌చిపోలేరు. అటువంటి వాటిలో `చంద‌మామ‌` ఒక‌టి. కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నవదీప్, కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరో హీరోయిన్లుగా న‌టించారు. శివ బాలాజీ, సింధు మేనన్, నాగబాబు, ఆహుతి ప్రసాద్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 6 సెప్టెంబర్ 2007న విడుద‌లైన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది.

మ్యూజిక‌ల్‌గానూ ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. అయితే ఈ సినిమాలో అస‌లు హీరో నేనే ఉంటూ ఎవ‌రికీ తెలియ‌ని ఓ సీక్రెట్‌ను రివిల్ చేశాడు యంగ్ హీరో అడివి శేష్‌. క్షణం, గూఢచారి, ఎవరు వంటి స‌స్పెన్స్ థిల్ల‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కులు చేరువైన శేష్‌.. ఇప్పుడు `మేజ‌ర్‌` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు.

శశికిరణ్ తిక్కా దర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రం జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైంది. ఇందులో సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా న‌టించింది. శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, రేవతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది.

ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగానే అడివి శేష్ `ఆలీ స‌ర‌దాగా` అనే కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం షేర్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే చంద‌మామ‌లో ఒరిజినల్‌ హీరో నేనే అని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఆయ‌న మాట్లాడుతూ.. `చాలా చిన్న చిన్న పాత్రలను చేస్తూ ఈ స్థాయి వరకూ వచ్చాను. చందమామ సినిమాలో ఒరిజినల్‌ హీరో నేనే. నవదీప్‌ స్థానంలో నేను ఉండాల్సింది. కానీ, రెండు రోజుల షూటింగ్‌ తర్వాత ఆ పాత్ర నాకు సెట్ అవ్వ‌క‌పోవ‌డంతో సినిమా నుంచి త‌ప్పించారు` అంటూ అడివి శేష్ చెప్పుకొచ్చాడు.


Share

Related posts

Swathi: కలర్స్ స్వాతి హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉన్న సమయంలో సినిమాల నుంచి అందుకే తప్పుకుందా..?

GRK

Rang De : “చూసి నేర్చుకోకు” అంటున్న నితిన్..!!

bharani jella

Tollywood : బిరుదులు మారిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..!

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar