Prabhas: ప్రభాస్(Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా(Sandeepreddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రభాస్ నీ అభిమానులు ఇప్పటిదాకా ఎప్పుడు చూడని రీతిలో.. చూపించడానికి సందీప్ రెడ్డి వంగ రెడీ అవుతున్నారు. అర్జున్ రెడ్డి(Arjun Reddy) లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ సినిమా ప్లాన్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే ప్రభాస్ తర్వాత బన్నీతో అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమా చేయడానికి సందీప్ రెడ్డి వంగా స్క్రిప్టు సిద్ధం చేసుకున్నట్లు ఇప్పటికే గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో రెండు మూడు సిట్టింగ్‌లు అయినట్లు.. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు లేటెస్ట్గా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ నేపథ్యంలో… తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల బన్నీ నటించిన పుష్ప(Pushpa) సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయ్యే ఊహించని రీతిలో భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది.
బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఏకంగా 50 కోట్ల మేర కలెక్షన్ సినిమా రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్. సౌత్‌లో ఇప్పటివరకు బన్నీ తెలుగులో పాటు మలయాళంలో భారీ మార్కెట్ ఉండగా కొద్దో గొప్పో తమిళం కన్నడంలో కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా రిలీజ్ చేయకపోయినా మొదటి సినిమా పుష్ప తోనే అక్కడి హీరోల సినిమాలతో సమానంగా అల్లు అర్జున్ కలెక్షన్లు కొల్లగొట్టడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీంతో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఎటువంటి సబ్జెక్ట్ బన్నీకి వినిపించాడు అనేది సస్పెన్స్ గా నెలకొంది. సినిమా ఓకే అయితే బన్నీ.. మార్కెట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!