గత ఏడాది `ఆర్.ఎక్స్ 100` వంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన అజయ్ భూపతికి మరో సినిమాను డైరెక్ట్ చేసే అవకాశమే రావడం లేదు. చాలా మంది హీరోలను కలిసి కథలు చెబుతున్నా ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కావడం లేదు. రీసెంట్గా నాగచైతన్యతో అజయ్ భూపతి సినిమా చేయాలనుకున్నాడు. కానీ చైతు ప్రాజెక్ట్ కూడా వర్కవుట్ కాలేదేమో ఇప్పుడు ఓ నిర్మాత తనయుడిని డైరెక్ట్ చేయబోతున్నాడట అజయ్ . ఇంతకు ఆ నిర్మాత ఎవరో కాదు.. రాజ్ కందుకూరి. ఈయన తన కొడుకు శివ కందుకూరితో అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం.
ఇప్పటికే శివ కందుకూరి శేష సింధురావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!