అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `అల..వైకుంఠపురములో..`. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాలో ఫస్ట్ పోస్టర్‌ను అల్లు అర్జున్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. క్లాస్, మాస్ లుక్‌లో బన్నీ కనపడుతున్నాడు. బెంజికారు పక్కన స్టూల్‌పై కూర్చుని బీడీ కాలుస్తున్నాడు. ఇంతకు ముందు విడుదల చేసిన టైటిల్ టీజర్‌కు కూడా చాలా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. పూజా హెగ్డే హీరోయిన్.. టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!