న్యూస్ సినిమా

Chiranjeevi: బ్యాడ్ న్యూస్..’ఆచార్య’ మాత్రమే కాదు మెగాస్టార్ చేస్తున్నవేవీ పాన్ కాదట..!

Share

Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు ఇది పెద్ద బ్యాడ్ న్యూస్. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న ‘ఆచార్య’ మాత్రమే కాదు ఇప్పుడు చేస్తున్న ఏ సినిమాలు పాన్ కాదట. బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ సహా మిగతా సౌత్ భాషలలో పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. యూనివర్సల్ కథ, భారీ బడ్జెట్ కేటాయించి అందరు హీరోలు పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ సంపాదించుకునేందుకే తాపత్రయపడుతున్నారు. ఇప్పటికే, ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, రామ్ చరణ్‌లు ఈ కేటగిరీలోకి వచ్చేశారు.

all chiranjeevi movies are not pan indian movies
all chiranjeevi movies are not pan indian movies

అయితే ఇప్పటి వరకు సినియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ లాంటి వారు మాత్రం ఈ తరహా సినిమాలు చేయడానికి ఎందుకో ఆసక్తి చూపించడం లేదు. అయితే, చిరంజీవి ఇప్పుడు నటిస్తున్న సినిమాలలో ఆచార్య పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అవుతుందని మెగా మల్టీస్టారర్ కాబట్టి పాన్ ఇండియా సినిమా అని ఇన్నిరోజులు ప్రచారం జరిగింది. కానీ, ఈ విషయంలో తాజాగా మెగాస్టార్ రామ్ చరణ్ ఆచార్య సినిమా పాన్ ఇండియన్ రేంజ్ కాదని క్లారిటీ ఇచ్చాడు. ఇది మెగా అభిమానులు షాకింగ్ విషయం అంటే..ఇక్కడ మరో షాకింగ్ విషయం కూడా చెప్పాడు.

Chiranjeevi: దీని కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

చిరంజీవి ఇప్పుడు గాడ్ ఫాదర్, భోళా శంకర్, మెగా 154. మెగా 156 సినిమాలు చేస్తున్నారు. అయితే, ఈ సినిమాలేవీ పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందడం లేదని వెల్లడించాడు చరణ్. ప్రస్తుతం చిరంజీవి కమిటయిన సినిమాలన్నీ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ అని అందుకే, వాటిని పాన్ ఇండియా వైడ్‌గా రూపొందించే అవకాశం లేదని తెలిపాడు. దీంతో కాస్త మెగా అభిమానుల్లో అసంతృప్తి నెలకొంది. చూడాలి మరి తర్వాత ప్రాజెక్ట్స్ ఏవైనా చిరు పాన్ ఇండియన్ రేంజ్‌లో సెట్ చేస్తారేమో. కాగా, ఆచార్య ఈ నెల 29న భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. దీని కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


Share

Related posts

దగ్గుబాటి ఇంట్లో పెళ్లి సందడి

Siva Prasad

బోరున ఏడ్చేసిన సుశాంత్ సింగ్ ప్రియురాలు..!!

sekhar

Diabetes: మధుమేహులు కూరలో కారంకు బదులు ఇవి తింటే.. డయాబెటిక్ లెవెల్స్ తగ్గుతాయట..!!

bharani jella