నిహారిక చైతన్య పెళ్లి వేడుక కోసం అతిధులు తరలివస్తున్నారు ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సందడి చేస్తుంది. వివాహ వేడుక కోసం అల్లు అర్జున్ ఫ్యామిలీ ఉదయపూర్ కు చేరుకుంది.అల్లు అర్జున్ తల్లిదండ్రులు, స్నేహ, పిల్లలతో కలిసి ప్రత్యేక విమానంలో ఉదయపూర్ కు చేరుకున్నారు
తల్లి తండ్రితో పాటు భార్య ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ నుంచి స్పెషల్ జెట్లో ఉదయపూర్లో దిగారు ఆ తర్వాత వీటి దీనికి సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీటికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిహారిక చైతన్య ల వివాహం డిసెంబర్ 9న జరగనుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అక్కడికి చేరుకుంది. పెళ్లికి సంబంధించిన ప్రతి వేడుకలో కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గోంటున్నారు.
ఫ్లైట్ లోనే అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫోటో షూట్ చేసింది. ఇందులో స్నేహ ఇద్దరు పిల్లలు ఉత్సాహంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. తాజాగా భార్య స్నేహరెడ్డితో కలిసి దిగిన ఫోటోనుఅల్లు అల్లు అర్జున్ ఇన్స్టాలో షేర్ చేశాడు. క్యూట్ అనే ట్యాగ్ లైన్ కూడా జత చేశాడు ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా షెడ్యుల్లో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ తీరిక చేసుకొని ఫ్యామిలీతో కలిసి నిహారిక పెళ్లి కోసం ఉదయపూర్ కి వచ్చారు
మెగా ఫ్యామిలీ ఏ వేడుక జరిగినా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి చివరికి చిరంజీవి కూతురు శ్రీజ రెండో వివాహం కూడా వేడుకగా జరిపారు. అయితే ఈ ఫ్యామిలీ లో జరిగే వేడుకలకు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం వారి ఏదో జరుగుతుందనే అనుమానలకు దారితీస్తుంది. మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టేశారానే వాదన వినిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ గా మారడం వల్లనే ఈ వివాహానికి హాజరు కాలేక పోతున్నారని సన్నిహితులు తెలిపారు
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!