నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత దాదాపు ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూడు సినిమాలను అనౌన్స్ చేశాడు. అందులో తన 19వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. దీని తర్వాత తన 20వ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు బన్ని. 21వ సినిమా `ఐకాన్ కనపడుట లేదు` ను దిల్‌రాజు బ్యానర్లో వేణుశ్రీరాం దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌కు వెళుతుందని సమాచారం. ఇందులో హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌ను నటింప చేయాలని యూనిట్ అనుకుంటుందట. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో `RRR` లో నటిస్తుంది అలియా భట్. రాజమౌళి సినిమా కాబట్టే తెలుగులో నటించడానికి అలియా ఒప్పుకుందనేది కాదనలేని విషయం. మరిప్పుడు బన్ని సినిమాలో అలియా నటించడానికి ఒప్పుకుంటుందా? లేదా? అలియా భట్‌కు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి దిల్‌రాజు ఒప్పుకుంటాడా? అనే ప్రశ్నలు బన్ని అభిమానులను తొలిచేస్తున్నాయి.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!