కన్ఫ్యూజన్‌లో మలయాళ ముద్దుగుమ్మ

48 views

 

నేచుర‌ల్ స్టార్ నాని నటించిన మ‌జ్ను సినిమాతో తెలుగు తెర‌కు ఎంట్రీ ఇచ్చిన ఎన్నారై భామ అను ఇమ్మానుయేల్‌. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైంలోనే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన అజ్ఞాత‌వాసి సినిమాలో అవ‌కాశం కొట్టేసింది. దాంతో త‌ర్వాతి టాప్ హీరోయిన్ అనుయే అనుకున్నారంతా. గొపిచంద్ తో ఆక్సిజన్,బ‌న్నీ స‌ర‌స‌న నా పేరు సూర్య‌ సినిమాలో కూడా అవ‌కాశం వ‌చ్చింది. అలాగే ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమాలోనూ, అయితే అజ్ఞాత‌వాసి ప‌లితం అను ఆశ‌ల‌ను త‌ల్ల‌కిందులు చేసింది. దీంతో ఎన్టీఆర్ సినిమా కోసం అమ్మడిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. ఆ త‌ర్వాత వ‌చ్చిన,ఆక్సిజన్, నా పేరు సూర్య‌ ప‌రాజయం పాల‌వడంతో ఈ బ్యూటీ ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకుంది.స్టార్‌ హీరోలతో చేసినా సినిమాలన్ని ఫ్లాప్ కావడంతో అమ్మడిని అందరూ ఐరెన్‌లెగ్‌ అనడం మొదలెట్టేశారు. అంతేకాదు ఆమె దృరదృష్టం తమకి అంటుకుంటుందేమోనన్న భయంతో మరికొందరు అమ్మడికి అవకాశాలు ఇవ్వడం మానేశారు.

అ తరువాత అనూ ఇమ్మాన్యూయేల్‌ తెలుగులో రెండు సినిమాలకు సైన్ చేసింది..అందులో శ్రీను వైట్ల ,రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా అమర్ అక్బర్ ఆంథోని సినిమా నుంచి ఏకంగా తప్పించేశారు.ఆ సినిమా యూనిట్‌ బల్క్‌ డేట్లు అడిగారట. అవి తన దగ్గర లేక తప్పుకున్నానంటోంది అనూ. అయితే అనూ చెబుతున్న మాటలను కొందరు నమ్మడం లేదు. అనూ తప్పుకోలేదనీ, తప్పించారని అంటున్నారు. ఎంత ఫస్ట్ గా స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ అందుకుందో, అంతే ఫస్ట్ గా వచ్చిన ఆఫర్స్ కూడా చేజారిపోవడంతో అనూ కెరీర్‌కి శుభం కార్డు పడినట్టే అని అంటున్నారు సినీ జనాలు.