Radhey Shyam: “బాహుబలి” సినిమా తో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్.. అప్పటి నుండి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. “బాహుబలి” తర్వాత చేసిన “సాహో”, “రాధేశ్యామ్” రెండూ కూడా అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు. కానీ రెండూ కూడా అంచనాలను అందుకోలేక అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పైగా రెండు సినిమాలకు దాదాపు ఏడాదిన్నర పైగానే డార్లింగ్ టైం కేటా యించడం రిజల్ట్… అట్టర్ ఫ్లాప్ కావడం అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది.
“రాధేశ్యామ్” కోసం ఏకంగా రెండున్నర సంవత్సరాలు ప్రభాస్ టైం కేటాయించారు. కరోనా రావడంతోనే ఇంత టైం వేస్ట్ అయినా గాని…”రాధేశ్యామ్” భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. మార్చి 11 వ తారీకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా.. ఎక్కడా కూడా హిట్ టాక్ సొంతం చేసుకోలేదు. కృష్ణంరాజు సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ మరియు యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ సంయుక్తంగా కలిసి నిర్మించిన ఈ సినిమా కనీస కలెక్షన్ లు రాకపోవడంతో.. సినిమా విడుదలైన 20 రోజులకే అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో స్క్రీమింగ్ అవ్వడానికి రెడీ అయిపోయింది.
ఏప్రిల్ 1 తారీకు నుండి అమెజాన్ ప్రైమ్ ఇన్ వీడియో లో “రాధేశ్యామ్” రిలీజ్ కానున్నట్లు.. అధికారిక ప్రకటన వచ్చేసింది. చాలా త్వరగా ఓటిటి లోకి “రాధేశ్యామ్” వచ్చేయడంతో ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారు. ప్రేమకథా నేపథ్యంలో రాధాకృష్ణ తెరకెక్కించిన..”రాధేశ్యామ్” ఏ మాత్రం అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే మరి కొద్ది రోజుల్లో కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. ప్రభాస్ నటిస్తున్న “సలార్” కి సంబంధించి కొత్త న్యూస్ రానున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!